ePaper
Thursday, March 12, 2026
📄 ePaper

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు 

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ రూరల్ సీఐ కే ఫణిధర్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ హమాలివాడ చెందిన నిందితుడు మీసాల అజయ్ ( 24) గత కొద్ది కాలంగా డబ్బులపై అత్యాశతో మహారాష్ట్ర నుండి గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ప్రజలకు బానిసగా చేస్తూ అమ్ముతున్నట్లుగా సమాచారం మేరకు అతనిని పట్టుకోగా అతని వద్ద ఒక గంజాయి ప్యాకెట్ లభించిందని అతనిని ఈరోజు అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.


ఇతనిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, విచరించగా ఇతనికి గత కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర  నాందేడ్ జిల్లా కి చెందిన విజ్జు అనే వ్యక్తి నుండి 400 గ్రాముల గంజాయిని 5000 రూపాయలకు కొనుగోలు చేసినట్టు దానితో ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఇతని వద్ద ఆదివారం రోజు ఐదు గ్రాముల కు చెందిన ఒక ప్యాకెట్ లభించిందని తెలిపారు. నిందితుడినీ న్యాయమూర్తి ముందు హాజరు పరిచయం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!