రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండలం
సీతాగొంది వద్ద గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో నలుగురు వ్యక్తులు స్పాట్ లొ మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయినట్టుగా తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి హైద్రాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు వెనుకనుంచి కంటైనర్ ను అతివేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. మృతులంతా ఆదిలాబాద్ వారే, అయితే ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తోంది. ప్రమాదానికి సంభందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.
Recent Comments