న్యూఢిల్లీ, నవంబర్ 1 : ప్రేమ త్రికోణం దారుణ హత్యకు దారితీసింది. కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్య చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
మిథాపూర్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల లక్ష్మీ, ఈస్ట్ వినోద్ నగర్‌కు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ చందర్ (29)తో ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. ఇదే సమయంలో 26 ఏళ్ల కేశవ్‌తో కూడా ప్రేమలో పడి, ఇటీవల నిశ్చితార్థం చేసుకుంది. ఇది తెలిసిన చందర్, పెళ్లి రద్దు చేయకపోతే జీవితాన్ని నాశనం చేస్తానని లక్ష్మీని బెదిరించాడు.
దాంతో కోపం వచ్చిన లక్ష్మీ, కేశవ్‌తో కలిసి చందర్ హత్యకు కుట్ర పన్నింది. అక్టోబర్ 25న చందర్‌ను మిథాపూర్‌కు రప్పించి, ఫరీదాబాద్‌లోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ కేశవ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి తాడుతో చందర్ గొంతు నొక్కి చంపి, తలపై కొట్టి మృతదేహాన్ని కాలువలో పడేశారు.
దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లక్ష్మీ, కేశవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్య
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments