Tuesday, October 14, 2025

వడ్డీ వ్యాపారులపై కొరడా జలుపించిన జిల్లా ఎస్పీ


*జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 43 బృందాలచే 13 మండలాలలో దాడులు.*

*అధిక వడ్డీలతో రైతులు ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు*

*వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, భూములు రాయించుకొని వడ్డీలకిస్తున్న వడ్డీ వ్యాపారాలు.*

*13 మండలాలలో దడులు 10 పోలీస్ స్టేషన్లో పరిధిలో 18 కేసులు నమోదు.*

*ఆకస్మిక దాడులతో వడ్డీ వ్యాపారుల వద్ద నుండి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్ బుక్కులు, బాండ్ పేపర్స్, సేల్ డేట్స్ స్వాధీనం.*

*నార్నూర్ నందు బంగారం కొదువ పెట్టుకుని అధిక  వడ్డీకిస్తున్న వ్యాపారి వద్ద నుండి 12 గ్రాముల బంగారం,235 గ్రాముల వెండి స్వాధీనం.*

రైతులు అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడుస్తున్న వడ్డీ వ్యాపారులపై కొరడా జలుపించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 13 మండలాలలో 43 బృందాలచే ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలో దాదాపు 18 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!



వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, వ్యవసాయ భూములు తమ పేర్లపై రాయించుకొని వడ్డీ నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారుల పై దాడులు. దాడులలో వడ్డీ వ్యాపారాల వద్ద నుండి ప్రామిసరీ నోట్లో బాండ్లు చెక్కుబుక్కులు ఖాళీ పేపర్స్ స్టాంప్ పేపర్స్ సేల్ డేట్స్ లాంటివి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా నార్నూరు మండలంలో బంగారం కుదువ పెట్టుకొని అధిక వడ్డీకి డబ్బులను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి వద్ద నుండి 12 గ్రాముల బంగారం 235 గ్రాముల వెండి స్వాధీనం చేసుకొని, నార్నర్ కు సంబంధించిన నిందితుడు ఉట్ల రవి s/o శంకరయ్య, లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్, పై కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. జిల్లా ఎస్పీ ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అక్రమార్కుల ఆటలు కట్టడం చేయడం జరుగుతుంది. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.
🔹 ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు
🔹 ఆదిలాబాద్ టు టౌన్  పోలీస్ స్టేషన్లో ఒక కేసు
🔹 తలమడుగు పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు
🔹 బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు
🔹 బేల పోలీస్ స్టేషన్లో ఒక కేసు
🔹 ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు
🔹 గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు
🔹 నార్నూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు
🔹 ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు
🔹 ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు మొత్తం 18 కేసులు నమోదయాయని వివరాలను వెల్లడించారు.

ప్రజల అవసరాలను లబ్ధి చేసుకుంటూ వడ్డీ పేరుతో నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టేలా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ ఈరోజు ఇలాంటి ఆకస్మిక తనిఖీలను చేపట్టడం జరుగుతుందని అధిక వడ్డీలకు ఇచ్చే వడ్డీ వ్యాపారులు ప్రజలను మోసం చేయడం మానివేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!