- నిర్లక్ష్యంగా వాహనం నడిపి బతుకమ్మ గద్దెను కారుతో ఢీ కొట్టిన పంచాయతీ సెక్రటరీ పై కేసు నమోదు.
- జందాపూర్ గ్రామం లో సోమవారం ఉదయం జరిగిన ఘటన.
- మహిళలతో బతుకమ్మ విషయంలో అసభ్యంగా దుర్భాషలాడి, మహిళల ఫిర్యాదుతో ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, విచారణ.మహిళపై శాఖపరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు సిఫార్సు
– ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిదర్
ఆదిలాబాద్: నిర్లక్ష్యంగా వాహనం నడిపి బతుకమ్మ గద్దెను కారుతో ఢీ కొట్టిన ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ పంచాయతీ సెక్రటరీ సుల్తానా బేగం పై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిదర్ తెలిపారు.
సిఐ తెలిపిన వివరాల ప్రకారం…. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామంలో ఉదయం సమయంలో, జందాపూర్ గ్రామపంచాయతీ సెక్రటరీ సుల్తానా బేగం నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఎస్సీ కాలనీ నందుగల బతుకమ్మ గద్దె పైనుండి వాహనాన్ని తీసుకువెళ్లడంతో మరియు మహిళలతో నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, మహిళల పట్ల బతుకమ్మ పట్ల దుర్భాషలాడిన సంఘటనపై మహిళల ఫిర్యాదుతో ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు పంచాయతీ సెక్రెటరీ సుల్తానా బేగంపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టడం జరుగుతుందని ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిధర్ తెలియజేశారు.
ఈ ఘటనపై మహిళా పై, శాఖ పరంగా మహిళ పై అధికారులకు నివేదికను పంపనునట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతరులకు ప్రమాదం కలిగేలా మరియు సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి పండుగలను అవమానించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments