- నకిలీ షురూటీ లో ప్రభుత్వ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ల సృష్టించి వాటిని నిజమైనవని కోర్టులో సబ్మిట్ చేసిన నిందితులు.
- నకిలీ షూరిటీ లను ఉపయోగించిన, లబ్ధి పొందిన,బ్రోకరిజం చేసిన 17 మంది పై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.
- నకిలీ డాక్యుమెంట్లతో కోర్టును సైతం మోసం చేసిన నిందితులు.
- నకిలీ షూరిటీ లను ఉపయోగించి కోర్టు ద్వారా కొందరు నిందితుల కు బెయిల్ మరియు వాహనాలు, సెల్ ఫోన్లు రిలీజ్
- ప్రభుత్వ అధికారులు అపరిచితులకు, నేరస్తులకు షూరిటీలను ఇచ్చే ముందు జాగ్రత్తలు పాటించాలి.
— ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
ఆదిలాబాద్ , రిపబ్లిక్ హిందుస్థాన్ : అదిలాబాద్ జిల్లాలో నకిలీ షూరిటీ పత్రాలు తయారు చేసి కోర్టును మోసం చేసిన కేసులో తలమడుగు మండలంలోని కొతూర్ గ్రామానికి చెందిన A1) కాటిపెల్లి అభిలాష్ రెడ్డి ( అరెస్ట్ ) , అదిలాబాద్ జిల్లా ఖుర్షిద్‌నగర్ కాలనీకి చెందిన A2) సయ్యద్ ఇర్ఫాన్ (24) (అరెస్ట్ ) , తలమడుగు మండలం కొతూర్ గ్రామానికి చెందిన A3) గంటి సత్న్నా (అరెస్ట్) , A4) మద్దెల అశోక్ (33) ( అరెస్ట్ ) , A5) రామిరెడ్డి @ ప్రమేశ్ రెడ్డి (అరెస్ట్) , A9) కోకటాయ్ అశోక్ (అరెస్ట్), ఆదిలాబాద్ క్రాంతి నగర్ A12) షాహీద్ (అరెస్ట్), A17) ఎండి అమీర్ s/o ఎండి ఇక్బాల్ (అరెస్ట్) లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
అదే విధంగా
కొతూర్ గ్రామానికి చెందిన
A6) గడుగు సురేష్ (పరారీ) , A7) ఉల్లెంగలువ భూమన్న (పరారీ), A8) బోర్కర్ రాజు ( పరారీ ) , A10) బోర్కర్ శ్రీనివాస్ (పరారీ), అదిలాబాద్ మహాలక్ష్మివాడకి చెందిన , A11) సద్దాం, (పరారీ) , ఆదిలాబాద్ జిల్లా ఖుర్షిద్‌నగర్ కి చెందిన A13), ముషీర్ (పరారీ), క్రాంతి నగర్ కు చెందిన A14) షాహీల్ (పరారీ), వడ్డర కాలనీ చెందిన A15) ఖలీమ్ (పరారీ), రణదివినగర్ కి చెందిన A16) జంటి (పరారీ) లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
తలమడుగు మండలం కోత్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి గీరవేని రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదిలాబాద్ II టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 498/2025, U/Sec 318(4), 335, 337, 338, 336(2), 340, 257 r/w 3(5) BNS కింద కేసు నమోదు చేయబడిందనీ తెలిపారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం అభిలాష్ రెడ్డి (కారోబార్), సయ్యద్ ఇర్ఫాన్ (బ్రోకర్) అనే వ్యక్తులు పంచాయతీ కార్యదర్శి సంతకాలను నకిలీగా సృష్టించి, నకిలీ గృహ విలువ పత్రాలు, పన్ను రసీదులు తయారు చేసి కోర్టులో నేరస్తులకు బెయిల్ కోసం, కోర్టు నుండి జప్తు చేయబడిన ప్రాపర్టీల రిలీజ్ కోసం స్యూరిటీ పత్రాలుగా సమర్పించినట్లు తేలింది. ఈ చర్యలో గంటి సత్తెన్న, మద్దెల అశోక్ ల పేర్లను ఉపయోగించి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం జరిగిందనీ అన్నారు.

ఈ సంఘటనపై శనివారం స్థానిక పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీసు ముఖ్య అధికారి అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్పందిస్తూ ప్రభుత్వ పత్రాలను నకిలీ చేయడం, కోర్టును తప్పుదారి పట్టించే చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ … పత్రాలను నకిలీ చేసే వారు, వాటిని ఉపయోగించి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే వారు ఎవరైనా కఠినమైన శిక్షలకు గురవుతారని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి నకిలీ పనులపై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కేసు నందు బ్రోకరు, కారోబార్ ఇద్దరు కలిసి వారి లబ్ధి స్వలాభంకై నకిలీ షూరిటీ పత్రాలను పంచాయతీ సెక్రటరీ పేరుపై తీసుకొని వాటిని ఉపయోగించి కోర్టు నందు నిందితులకు షూరిటీలుగా ఇచ్చి, కోర్టు ఉత్తర్వుల ద్వారా జైలు నుండి బయటకు రావడం లాంటి చర్యలను చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కోర్ట్ నందు పంచాయతీ సెక్రెటరీ ధ్రువీకరించినట్టుగా ఉండేటువంటి నకిలీ ఆస్తి పత్రాలను షూరిటీలుగా చూపిస్తూ, వాహనాలను సెల్ఫోన్లను కొన్ని ప్రాపర్టీలను రిలీజ్ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ అధికారులకు సూచనలు ఏమనగా తెలియని వారికి, పెద్ద పెద్ద నేరాలు చేసే వారికి, బ్రోకర్ల ద్వారా వచ్చే వారికి షూరిటీలు ఇచ్చి మోసపోకుండా ఉండాలని, మీరూ షురూటి ఇచిన నిందితులు పారిపోయినట్లయితే మీనుండి డబ్బులను, ఆస్తిపత్రాలను జప్తు చేయబడుతుందని, కట్టని యెడల ఆస్తుల స్వాధీనం లేదా చట్ట పరమైన చర్యలు ఉంటాయి. సూచనలు ఇచ్చారు.
ఈ ఘటన నందు నకిలీ షూరిటీ ల ద్వారా లబ్ధి పొందిన నిందితులపై కూడా కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments