
• చీటింగ్ ఘటనలో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.
• ప్లాటుకు నకిలీ పత్రాలు సృష్టించి మోసం.
• ప్లాట్ ను రెవెన్యూ అధికారులు కేటాయించినట్లు నకిలీ పత్రాలు సృష్టి.*
• చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానులే.
• బాధితులు ఎవరైనా నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించండి.
• మోసం చేసేవారి పై, ఫోర్జరీ చేసే వారిపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుంది.
నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ అమ్మి మోసం చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కేసు వివరాలు వెల్లడించారు…. డీఎస్పీ తెలిపిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి…. ఆదిలాబాద్ జిల్లా విద్యానగర్ కి చెందిన జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న A1) కొండూరి గంగాధర్ (55) మరియు రిక్షా కాలనీ కి చెందిన ఎంప్లాయిమెంట్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న A2) దేవల్ల గోవర్ధన్ (54) ఇద్దరు ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ అధికారులు కేటాయించినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి ప్లాటును విక్రయించి మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదు దారురాలు *ఠాకూర్ రూపరాణి* ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో
ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, నిర్మల్‌కు చెందిన ఠాకూర్ రూపరాణి (44) భర్త ఠాకూర్ రవీందర్ సింగ్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ జిల్లా పరిషత్, ఆదిలాబాద్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలో ఆయనకు *కొండూరి గంగాధర్* అనే నాల్గవ తరగతి ఉద్యోగి పరిచయమయ్యాడు. గంగాధర్, సర్వే నంబర్ 346, ప్లాట్ నంబర్ 179, అటెండర్స్ కాలనీ, ఆదిలాబాద్ లో ఎంప్లాయిమెంట్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ *దేవల్ల గోవర్ధన్* పేరు మీద ఒక ప్లాటు అమ్మకానికి ఉందని రవీందర్ సింగ్‌కు తెలిపాడు. నిజానికి ఈ ప్లాటు 1996 సంవత్సరంలో ప్రభుత్వం తహసిల్దార్ ద్వారా అమీరుద్దీన్ అనే వ్యక్తికి కేటాయించినట్లుగా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు.
ఈ ప్లాటను 2006లో రూపరాణి, ఆమె భర్త ఆ ప్లాటును చూసి నచ్చడంతో, కె. గంగాధర్, డి. గోవర్ధన్ సమక్షంలో రూ. 65,000/- చెల్లించారు. 2006 నవంబర్ 10న కె. గంగాధర్ మధ్యవర్తిత్వం వహించి *దేవల్ల గోవర్ధన్* తో అమ్మకపు ఒప్పందం చేయించాడు. తరువాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 4433/06 ప్రకారం రూపరాణి పేరు మీద ప్లాటు రిజిస్టర్ అయింది.
భర్తకు బదిలీ కావడంతో వారు నిర్మల్‌కు మారారు. ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడల్లా తమ ప్లాటును చూసుకునేవారు. అయితే, ఇటీవల ఆ ప్లాటు వాస్తవానికి అమీర్ ఖాన్ కుమారుడు అహ్మద్ ఖాన్‌కు చెందినదని గుర్తించారు. నకిలీ పట్టా పత్రాలను అసలు పత్రాలుగా చూపించి తమను మోసం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
రూపరాణి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ పోలీసులు క్రైమ్ నంబర్ 409/2025 కింద భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 467, 468, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇదివరకే ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కొండూరి గంగాధర్ పై కేసు నమోదువై అరెస్ట్ అయి జైలుకు రిమాండ్ కు వెళ్లడం జరిగిందని తెలిపారు.
ఈ కేసు నందు ప్రస్తుతం నిందితులు ఇద్దరు అరెస్టు అయి 14 రోజుల జ్యూడిషరీ రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే అని తప్పుచేసే ఎంతటి వారినైనా జిల్లా పోలీస్ యంత్రాంగం విడిచి పెట్టేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. బాధితులు ఎవరైనా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని నిర్భయంగా సంప్రదించాలని చీటింగ్ చేసిన ఫోర్జరీ చేసిన వారిని జిల్లా పోలీసు యంత్రాంగం విడిచిపెట్టదని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments