• రైతు వద్ద 50,000 నగదు డిమాండ్, 30 వేల రూపాయల వసూలు చేసిన విలేకరులు.
• అప్పు తెచ్చి విలేకరులకు డబ్బులు చెల్లించిన రైతు.
• రైతును బెదిరించి, భయపెట్టి వసూళ్లకు పాల్పడిన ముగ్గురు నేరడిగొండ విలేకరులు , రూ. 1800 నగదు స్వాధీనం.
రిపబ్లిక్ హిందుస్థాన్, నేరడిగొండ / ఆదిలాబాద్:
ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపిన వివరాల ప్రకారం,
ఫిర్యాదుదారు మరియు బాధితుడు టగరే కాసాన్ దాస్ s/o న్యాల్ సింగ్, సుర్జాపూర్ గ్రామం నేరడిగొండ గ్రామానికి చెందిన వ్యక్తి. మే 18 వ తారీఖున ఇంట్లో తన కూతుర్ల పెళ్లిలు ఉండడంతో పండిన జొన్న పంటను దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూలు ఆవరణలో ఆరబెట్టుకోవడం గమనించిన
1) గాజుల దేవేందర్ , 2) షేక్ ఫస్యుద్దీన్ , 3) గాజుల శ్రీకాంత్ అనే ఈ ముగ్గురు విలేకరులు బాధితుని బెదిరించి నీపై ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని భయపెట్టడం జరిగిందని తెలిపారు.
ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉండడానికి రైతు వద్ద 50 వేల రూపాయలను అడగడంతో, దీంతో భయపడిన రైతు 30 వేల రూపాయలను ముగ్గురికి అందజేయడం జరిగిందని తెలిపారు. రైతుని భయపెట్టి బెదిరించి బలవంతంగా అతని వద్ద నుండి 30 వేల రూపాయల నగదును తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కారణంగా ఈ ముగ్గురు వద్ద నుండి రూ.1800 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా ఈరోజు ఈ ముగ్గురిని అరెస్టు చేసి న్యాయస్థానం అనుమతితో రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. బలవంతంగా బెదిరింపులకు పాల్పడుతున్న ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా జిల్లా పోలీసు యంత్రంగా కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేరేడుగొండ ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments