ePaper
Thursday, March 12, 2026
📄 ePaper

బేల, జైనత్, బోథ్, ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు వీడీసీలపై కేసులు నమోదు : ఎస్పీ

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

విడిసిల అక్రమ కార్యకలాపాలపై ఉక్కు పాదంతో అణచివేస్తాం.

1. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే.విడిసిలు అక్రమ వసూళ్లకు, దందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడరాదు.
2. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలి.
3. ఇప్పటివరకు జిల్లాలో 5 విడిసిలపై కేసులు నమోదు.
4. విడిసి బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి

ఆదిలాబాద్ : గ్రామ అభివృద్ధి కమిటీలు ప్రజల కు భారంగా ప్రజల వద్ద న్యాయస్థానాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించకుండా గ్రామ అభివృద్ధి పేరుతో వసూలను చేయడం చట్ట వ్యతిరేకమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ

…..   గ్రామ అభివృద్ధి కమిటీలు గత 15 సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాలలో గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామాలలో గ్రామ అభివృద్ధి అవసరాలకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు.

కాలక్రమమైన ఈ గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా గ్రామాలలో జరిగే సివిల్ తగాదాలు భూ తగాదాలు వివాహ సంబంధ తగాదాలు అన్నదమ్ముల తగాదాలు భార్యాభర్తల తగాదాలతో వారిని పిలిపించి అట్టి పంచాయతీలలో వారు వినని యెడల వారికి దండుగా వేసి చట్టం చేయవలసిన పనిని వారి చేతుల్లోకి తీసుకొని వాళ్లను పోలీస్ స్టేషన్లకు, న్యాయస్థానానికి ఆశ్రయించకుండా గ్రామ ప్రజలను తాము చెప్పిన విధంగా వినాలని, వినని ఎడల ఆ గ్రామం నుండి వెలివేస్తాము అని భయబ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది.

గ్రామంలో డబ్బులు వసూలు చేయడానికి గ్రామ అభివృద్ధి పేరుతో బెల్ట్ షాపులను, ఇసుక అక్రమ రవాణాపై, కళ్ళు దుకాణాలను వేలం వేయడం ఎక్కువ ధర చెల్లించిన వ్యక్తికి ఆ గ్రామంలో వస్తువులను అమ్మే విధంగా వసూళ్లను చేయడం చట్ట విరుద్ధం అని తెలిపారు.

గ్రామాభివృద్ధి పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయబడతాయని అదేవిధంగా గ్రామాలలో బెల్ట్ షాపులను కళ్ళు దుకాణాలను నిర్వహించుకోవడానికి అనధికారికంగా అనుమతులు జారీ చేయడానికి వీడీసీలకు అర్హత లేదు. వారి అనుమతితో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిర్వహించే వారిపై మరియు విడీసీలపై కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.

ఎవరైనా గ్రామ అభివృద్ధి వలన ఇబ్బందులు ఎదుర్కునే వారు దగ్గరలో ఉన్న తమ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని భవిష్యత్తులో అసాంఘిక కార్యకలాపాలకు, ఎలాంటి బహిష్కరణలను మరియు వసూళ్లకు పాల్పడిన చర్యలు తీసుకోబడతాయని ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఇప్పటివరకు జిల్లాలో ఐదు కేసులు నమోదు అయినట్టు వాటి వివరాలు తెలియజేస్తూ బేల పోలీస్ స్టేషన్ నందు, జైనత్, బోథ్, ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు వీడీసీలపై కేసులు నమోదు అయినట్లు తెలిపారు. గతంలో సాంగ్వి మరియు సాంగిడి గ్రామాలలోని విడీసీలపై ఇసుక ట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులపై కేసులో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. రెండు రోజుల క్రితం జైనథ్ బోరాజ్ మండలాలలోని పెండలవాడ సాంగ్వి గ్రామాలలోని వీడిసి సభ్యులు భూమారెడ్డి మరియు అతని సోదరుడు రాంరెడ్డి పై ఇసుక తరలింపులో ట్రాక్టర్ల వద్ద 500 రూపాయల వసూలు చేసినట్లు దానిపై జైనథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!