• సమాచారం అందితే గానీ పట్టుబడని అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలు..!
రిపబ్లిక్ హిందూస్థాన్,ఇచ్చోడ : పేదోడి బియ్యం పెద్దోళ్ల పాలవుతున్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడుతున్న కూడా తగ్గేది లేదు అంటూ రేషన్ బియ్యం మాఫియా అక్రమంగా రేషన్ బియ్యం అక్రమంగా తరలించి కాసులు కూడబేట్టుకుంటున్నారు.
సోమవారం అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యన్ని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 292 క్వింటాల్ల బియ్యన్ని లారీలో అక్రమంగా తరలిస్తుండగా , రేషన్ బియ్యం లోడ్ తో వెళుతున్న లారీ పోలీసులకు ఇచ్చోడలో పట్టుబడింది.
సమాచారం అందితేనే….
అయితే ముందస్తు సమాచారం అందితే కానీ వాహనాలు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలు పట్టుబడడం లేదని మండలంలో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇచ్చోడ మండల కేంద్రంగా సైతం పెద్ద ఎత్తున రేషన్ బియ్యం వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇచ్చోడ మండల కేంద్రం నుండి మహారాష్ట్ర కు పిడిఎస్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం.
Recent Comments