రిపబ్లిక్ హిందుస్థాన్ నల్లబెల్లి: మండల కేంద్రంలో అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో రోజురోజుకు నాటసార గుడుంబా ఏరులై పారుతున్న ఎక్సైజ్ పోలీసులు మరియు పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు అని అన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!
నల్లబెల్లి మండల హెడ్ కోటర్ లో మరియు పలు గ్రామాలలో విచ్చలవిడిగా నాటుసార గుడుంబా షాపులు గుడంబా అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి అని పేర్కొన్నారు.
ఈ నాటు సారా సేవించడం వల్ల మహిళలపై అత్యాచారాలు దాడులు మైనర్ బాలికలపై అత్యాచారాలు హత్యలు దొంగతనాలు నేరాలు ఎక్కువ పెరిగిపోతున్నాయని, అలాగే కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని అన్నారు. ఎంతోమంది బానిసలుగా మారి కుటుంబ బాధ్యతలు మరిచిపోయి మరణం మీదికి తెచ్చుకొని చనిపోతున్నారు. ఇలా ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు రోడ్డుపై పడుతున్నాయి .
నేరుగా బాధితులు వెళ్లి ఎక్సైజ్ అధికారులతో మరియు పోలీసు అధికారులతో చెప్పిన పట్టించుకోని నాదులే లేరు ఏమిటి ఈ ఘోరం ఎక్సైజ్ పోలీస్ అధికారులకు మరియు స్థానిక పోలీస్ అధికారులకు మామూలు ఏమైనా ముడుతున్నాయా కండ్ల ముందు జరుగుతున్న పట్టించుకోని పోలీసు అధికారులు ఎక్సైజ్ పోలీస్ అధికారులు అని వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందించి నాటసార అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని గడ్డం సుభద్ర డిమాండ్ చేశారు. లేదుంటే నల్లబెల్లి పట్టణ ప్రాంతంలో మహిళలతో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకోలు చేయుటకు వెనకాడ బొమని ఆమె హెచ్చరించారు.
Recent Comments