ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

పట్టణ ప్రగతిలో జరిగిన అభివృద్ధి ఇదేనా..??

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందూస్థాన్

గ్రామాల్లో,పట్టణాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది.కానీ ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇస్లాం పుర,రంజాన్ పుర కాలనీలలో పట్టణ ప్రగతి చేతల్లో కాదు కేవలం రాత లకే పరిమితమైదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిన్నపాటి వర్షానికే ఈ కాలనీలలోని రోడ్లు బురదమయమై ప్రజలు,వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురికి నీరు గుంతల్లో నిలువడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి.

ఇచ్చోడా లో రోడ్ల పరిస్థితి

తద్వారా కాలనీవాసులు వ్యాధుల బారిన పడుతున్నారు.మా కాలనీలను అభివృద్ధి చేయడంలో ప్రజాప్రతినిధులు ఆఫీసర్లు సవతితల్లి ప్రేమను చూపించడంలో అంతర్యం ఏమిటి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాకపోతే కాలనీలలోని సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని కాలనీవాసులు అంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!