కోట్ల రూపాయల లావాదేవీలు బాండ్ పేపర్ పైనే ..
అక్రమ లే అవుట్ ల వ్యాపారంలో భారీ కుదుపు…
ముందుకు రాని కొనుగోలు దారులు..
ఒకప్పుడు కోటి పలికిన ప్లాట్లు , భవనాలు.. లక్షల్లో ధర పడిపోయిన వైనం…
సగం ధర కూడా రాని పరిస్థితి..
ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు… అధికారుల ఆదేశాలు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:
అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ మండల కేంద్రంలో ప్లాట్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇచ్చోడమండలం తో పాటు ఆసిఫాబాద్ , ఉట్నూర్, జైనూర్ , ఇంద్రవెల్లి తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో అక్రమంగా పుట్టగొడుల వెలిసిన లే అవుట్ల లో వెల్సిన ప్లాట్ల విక్రయాలు 90% పడిపోయాయి. ఒకప్పుడు రహదారి ( రోడ్) వెంట ఉన్న ప్లాట్ల ధరలు రు.70 లక్షల నుండి రూపాయలు కోటిన్నర వరకు కూడా పలికిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో జైనుర్ వంటి ఘటనలు పునావృతం కాకూడదు అనుకున్నది ఏమోకానీ.. ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.
అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన విషయం తెలిసిందే. ఏజెన్సీ ప్రాంతంలో జరిగే భూ క్రయ విక్రయాల పై కఠిన ఆదేశాలు ఉన్నాయి.
ఇచ్చోడ మండల కేంద్రంలో 5 కిలోమీటర్ల వరకు ఏజెన్సీ తీసివేస్తున్నారని ఎవరు పుకారు లేపారో కానీ… ఈ పుకారు తో గిరిజనేతరులు విచ్చల విడిగా ఇచ్చోడ మండల కేంద్రంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసుకున్నారు.
ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్
/https://republichindustan.in/adilabad-collector-sdc-court-agency-area-tribes-rights-reserved-non-tribes-illegal-finance-business-baned-in-agency-area/
కొన్న కోట్ల రూపాయల ప్రాపర్టీలు కేవలం బాండ్ పేపర్ల పైనే రాసి ఉన్నాయి. ఇచ్చోడాలో కోటిన్నర రూపాయలకు కొన్న ప్రాపర్టీ కూడా కేవలం బాండ్ పేపర్ పై మాత్రమే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇది వాస్తవము కూడా.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు కోట్లకు కొన్నటు వంటి ఆస్తి ఇప్పుడు ఏ ధర పలక కుండా పోతుంది అనిపిస్తుంది. ఏవైతే ప్లాట్లు మరియు భూములు ఉన్నాయో వాటి ధర సరాసరిగా 90% పడిపోయిన అంటే అది శక్తి కాదు.
బాండ్ పేపర్ల పై జరిగే విక్రయాలకు గ్రామపంచాయితీ వారు అండగా ఉండడంతో …. ఒక్కో ప్లాటుకు టాక్స్ రశీదు ఇవ్వడానికి గ్రామపంచాయితీ అధికారులు భారీ మొత్తంలో వసూలు చేసుకున్నారు.
ప్లాటు విలువను బట్టి టాక్స్ రశీదు ఇవ్వడానికి గిరిజనేతరుల వద్ద రూ. 30 వేల నుండి లక్ష రూపాయల వరకు మాములు తీసుకుని గ్రామపంచాయతీ రికార్డులో ఎక్కించిన దాఖలాలు ఉన్నాయి.
అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల మధ్య జరిగే భూ లావాదేవీలు చెల్లవని తెలిసిన గ్రామపంచాయితీ అధికారులు కేవలం మాముల్
ముఖ్యంగా గ్రామపంచాయతీలో బాండ్ పేపర్ల పై రాసుకునే ప్లాట్లకు గాని ఇతర ఏదైనా గ్రామపంచాయతీ ఈవోలు ఎంతో కొంత మామూలు తీసుకుని గ్రామపంచాయతీ రికార్డుల్లో ఎక్కించేవారు. దీంతో గిరిజనేతరులు భారీ ఎత్తున ఇచ్చోడ ప్రాంతంలో ప్లాట్లను కొనుగోలు చేశారు.
కానీ ఇప్పుడు ఉన్నత అధికారుల ఆదేశాలతో ఒక్కసారిగా పరిస్థితి తలకి తలకిందులు అయినట్టుగా కనిపిస్తుంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఎత్తుగడ … 5 కిలోమీటర్లు ఏజెన్సీ తీసివెస్తున్నారని… పుకార్లు..
కొంతమంది వెంచర్ దారులు లేఅవుట్లు తీయడంతో అదే విధంగా ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ మండల కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల మేరకు ఏజెన్సీ ఉండగానే వదంతులు తో పాటు ఒక పుకారులు లేపడంతో చాలామంది గిరిజనేతరులు ఆస్తులు కొనుగోలు చేసుకున్నారు
*ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన పై ఇటీవల జిల్లా కలెక్టర్ ….. ఏమన్నారంటే … *
తేది:27.09.2024
అదిలాబాద్ జిల్లా గురువారం
పెసా చట్టం పంచాయితీల ( షెడ్యూల్ ప్రాంతాలకు పొడిగింపు) 1996 యొక్క నిబంధనల ప్రకారం పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు కల్పించడం జరిగింది.
జిల్లా పాలనాధికారి రాజర్షి షా.
PESA చట్టంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు కల్పించడం జరిగింది. దీని ప్రకారం ఏ ప్రభుత్వ శాఖ అయినా చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి స్థానిక గ్రామ సభ తీర్మానం తప్పనిసరి .
ఈ గ్రామ సభలో గ్రామ ఓటర్లు అందరు సభ్యులే. గ్రామసభ నిర్వహణకు కావలసిన కోరం 1/3. అందులో కనీసం 50 శాతం గిరిజనుల హాజరు తప్పనిసరి. అట్టి తీర్మానాల నిర్ణయాలను నాలుగు వారాల లోపు సంబంధిత శాఖకు సమర్పించాలి.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి
తహసీల్దార్లు, ఎంపీడీవో, mpo, SDC, తదితర సిబ్బందికి ఇట్టి వాటి పై పవర్
పాయింట్ ప్రజంటేషన్ ద్వార అవగాహన కల్పించడం జరిగిందనీ గిరిజనుల హక్కుల కు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని ఆదేశించారు .
1 of 70 నిబంధనలు
భారత రాజ్యాంగం లోని 5 వ షెడ్యుల్ అధికరణలు 15,16, 46, 244, 275, 330, 322, 334, 335, 338, 339, 342, గిరిజనులకు రక్షణ , గిరిజనుల సామాజిక పద్ధతులు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం మిగితా మైదాన ప్రాంతవాసులకు భిన్నంగా ఉండటడం, గిరిజనుల కొరకు
1 of 70 చట్టాలు రూపొందించబడ్డాయి.
రాజ్యాంగం కల్పించిన రక్షణలు
ఎన్నికలలో రిజర్వేషన్, ఏజెన్సీలో ST లకే పదవులు, విద్యా వసతులు, ఉద్యోగాలలో ఏజ్ సడలింపు,
వడ్డీ వ్యాపారుల నుంచి సంరక్షణ , ఆదివాసుల భూమి రక్షణ కోసం, మైదాన ప్రాంతవాసులు ఏజెన్సీ లోకి వలస రాకుండా అడ్డుకోవడం.
1/1959 రెగ్యులేషన్ ప్రకారం 01.12.1963 నుండి గిరిజనుల నుండి గిరిజనేతరులకు భూమి బదలాయింపు చెల్లదు.
1/70 నియమాల ప్రకారం 03.02.1970 నుండి గిరిజనుల లేదా గిరిజనేతరుల భూ బదలాయింపు గిరిజనేతరులకు చెల్లదు.
గిరిజనుల, గిరిజనేతరులకు మధ్య నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి ఏజెన్సీ కోర్టులను ఆశ్రయించాలి.
షెడ్యుల్ ప్రాంతాల్లో పూర్తి హక్కులు గిరిజనులకు కలవు.
ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘించినచో ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, లేదా 2 వేల రూపాయలు జరిమానా లేదా రెండూ విధించవచ్చు .
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments