రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్ :
బతుకమ్మ పండుగ ఆదివాసి సంస్కృతి సాంప్రదాయం కాదని, ఆదివాసి మహిళలు, దివాడి జల్కా మాత్రమే ఆడాలని ఆదివాసీ సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ రాయిసిడం జంగు పటేల్ అన్నారు. గురువారం రోజున గుడిహత్నూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ విషయాన్ని ఆదివాసి సమాజ పెద్దలు ప్రతి ఆదివాసి గూడేల ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని, సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. లేదంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని, డిజే సౌండ్ లో అర్థం లేని పాటలకు చాలా గ్రామాల్లో సంస్కృతి సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రోత్సాహం ఇస్తున్నారని ఆయన అన్నారు.
Recent Comments