రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా రైతాంగానికి రైతు రుణమాఫీ 2024 నందు ఆహార భద్రత కార్డు లేని రైతు కుటుంబాల గుర్తింపున కై మండలాల వారిగా నోడల్ అధికారులని నియమించడం జరిగిందనీ జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
నియమించిన నోడల్ అధికారులు గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం రేపటినుండి గ్రామాలలో సందర్శించి రైతు వారిగా కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయడం జరుగుతుంది. కనుక మండల వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ విస్తీర్ణ అధికారి సూచించిన తేదీల ప్రకారం మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు దృవీకరణ పత్రం సమర్పించి మీ యొక్క కుటుంబాన్ని నిర్ధారణ చేసుకోగలరని విన్నపం. ఇట్టి కుటుంబ నిర్ధారణ జరిగిన కుటుంబాలకు వచ్చే దఫాలలో రుణమాఫీకి అర్హత పొందుతారు. కనుక వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించి రైతు రుణమాఫీ పథకంలో లబ్ధి పొందగలరని సూచించారు.


Recent Comments