పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని సరిహద్దులో బీఎస్ఎఫ్ పోస్టుపై పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఈ దాడిని బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది.
దాదాపు 20 నిమిషాలకు పైగా బీఎస్ఎఫ్, పాకిస్థాన్ రేంజర్ల మధ్య ఈ కాల్పులు జరిగాయి. అధికారులను ఉటంకిస్తూ పీటీఐ ఈ సమాచారం ఇచ్చింది.
అంతకుముందు 2023 నవంబర్‌లో కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వీరమరణం పొందాడు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి, ఫిబ్రవరి 25, 2021 న, భారత్, పాకిస్తాన్ సైన్యాలు 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి కాల్పులు ఆపాలని నిర్ణయించాయి. 2023 అక్టోబర్‌లో కూడా పాక్ రేంజర్లు పాకిస్థాన్‌లోని ఇక్బాల్ , ఖనూర్ పోస్టుల మధ్య సైనికులపై కాల్పులు జరిపారు. జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దుపై పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది. ఇందులో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు.


Recent Comments