Wednesday, October 15, 2025

పొలాల వెంట విద్యుత్ తీగల అమరిస్తే కఠిన చర్యలు తప్పవు

పంటలకు రక్షణగా కానీ, అడవి జంతువులను వేటాడడానికి విద్యుత్ తీగల అమరిస్తే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

*అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన వారిపై చర్యలు…*

*ఐపిసి 304 II ప్రకారం చట్టరీత్యా శిక్షార్హులు 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష లేదా యావజ్జీవ  కారాగారా శిక్ష పడే అవకాశం.*

*ఇదివరకే జిల్లాలో నాలుగు సంఘటనల్లో  నలుగురు అమాయకులు మృతి,కేసులు నమోదు,.*

జిల్లాలో అడవి జంతువులను వేటాడడానికి, పంటకు రక్షణగా గాని అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పేర్కొన్నారు. అడవి జంతువులను వేటాడే క్రమంలో వేటగాళ్లు కరెంటు తీగలను అమర్చడం వల్ల, పంట పొలాలకు రక్షణగా జంతువుల బారిన పడకుండా విద్యుత్ తీగలు అమర్చి క్రమంలో, పంట పొలాలకు వెళ్లే రైతులు, జంతువులు, అటుగా వెళ్లే పోలీసు, ఫారెస్ట్  సిబ్బంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వ్యక్తులపై ఐపిసి 304 II ప్రకారం చట్టరీత్యా శిక్షార్హులు వీరికి నేరం రుజువు అయితే 10 సంవత్సరముల వరకు కఠిన కారాగార శిక్ష లేదా యావజీవకారాగార శిక్ష పడే అవకాశం ఉన్నందున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నార్నూర్ మండలానికి  సంబంధించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ నిన్న కూంబింగ్గ్ ఆపరేషన్ లో భాగంగా కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి కరెంటు దుశ్చర్యలకు పాల్పడడం వల్ల మరణించడం శోచనీయం వారికి జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి ఒక్క లబ్ధిని సకాలంలో అందేలా కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే జిల్లాలో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారి యొక్క సమాచారం అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, సమాచారం అందజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు. జిల్లాలోని మావల, గుడిహత్నూర్, బోథ్, తలమడుగు మండలాలలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం వల్ల నలుగురు అమాయకులు మరణించడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!