ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలి రా పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తూ.. అధికార వైసీపీపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు.
ఈ సభల్లో సీఎం జగన్ అవినీతిని ప్రజాముఖంగా ఎండగడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటు చేసిన రా.. కదలిరా సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.
ఈ సభ ప్రాంగణంలో తనిఖీలు చేస్తుండగా.. చంద్రబాబు దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద బాంబ్ బజర్ మోగడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ టీం విస్తృత తనీఖీలు చేశారు. బజర్ మోగిన తవ్వి చూడగా అందులో నుండి ఒక రాడ్ బయటపడింది. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా చంద్రబాబు చేపడుతున్న రా.. కదలి రా సభలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments