ఊరూరా రెపరేపలాడిన జాతీయ జెండా.
ఘనంగా గణతంత్ర వేడుకలు...
నల్లబెల్లి, జనవరి 26 :
మండలంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో వేడుకలను చేపట్టారు.



మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగరవేసి, వందన సమర్పణ చేశారు. తాహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి రాజేష్ ,ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, పోలీస్ స్టేషన్లో ఎస్సై నైనాల. నగేష్, మథర్ తెరిస్సా మండల సమాఖ్య కార్యాలయంలో ఎం పి ఓ సునీత, పీఏసీఎస్ కార్యాలయం ఆవరణలో పీఏసీఎస్ చైర్మస్ చెట్టుపల్లి మురళీధర్, రైతు వేదికలో ఏ ఓ పరమేష్, గ్రంధాలయం లో ఇంఛార్జి లైబ్రేరియన్ రాపాల లక్ష్మి నారాయణ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, నల్లబెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నానబోయిన రాజారాం, ప్రెస్ క్లబ్ లో ప్రధాన కార్యదర్శి సట్ల రమేష్ గౌడ్ ,రుద్రగూడెం కాకతీయ గురుకుల విద్యాలయంలో మెడవరపు కమలాకర్ రావు, కారుణ్య జ్యోతి హైస్కూల్లో మరియాదాసు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఏ వసంత, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఇంచార్చ్ హెచ్ ఎం సుభాష్, కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో సునిత, ఆదర్శ వాని విద్యాలయంలో నాగనబోయిన రవి, బస్టాండ్ అవరణంలో చుక్క శ్రీకాంత్ గౌడ్, ఆయా గ్రామా పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు,ఆంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు జెండాలను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకొని నివాళులర్పించుకోవాలన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్చ, స్వాతంత్య్రములు ఎందరో సమరయోధుల ఆత్మార్పణ ఫలమన్నారు. ఈ స్వేచ్చ, స్వాతంత్రాలు ఉపయోగించుకుని ప్రజలందరూ, శాంతి, సౌబ్రాతృత్వాలుతో జీవిస్తూ, దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. విద్యార్థినీ, విద్యార్థులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని పెంపొందించాయి. ఈ వేడుకల్లో ఎంపీపీ ఊడుగుల సునిత ప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్, మాజీ ఎంపిపి బానోత్ సారంగపాణి,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు బోళ్ళ శ్రీలత, మథర్ తెరిస్సా మండల సమాఖ్య ఆధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు
Recent Comments