రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఇప్పుడు ఎక్కడ కూడా ఆధార్ కార్డ్ లేకుండా పని కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ఆధార్ కార్డ్ కు అనుసంధానం చేస్తున్నాయి. అయితే ఈ పథకాలు పొందాడని ఆధార్ అప్డేట్ తప్పని సరి చేయడం తో ప్రజల కష్టాలు వర్ణనాతీతం… చంటి పిల్లలతో మహిళలు ఉదయం నుండి ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా కేంద్రాలను రన్ చేస్తున్నారు. దీనికి తోడు సమయ పాలన కూడా ఉండడం లేదు. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు కూడా గత ప్రభుత్వంలో ఎలాగైతే సోమరిపోతుల పాత్ర వహించారో ఇప్పుడు అదే తంతు కొనసాగుతుంది.
ప్రజలకు ఆధార్ అప్డేట్ తప్పని సరి చేసి దానికి సరిపడా ఆధార్ సెంటర్ లు కూడా ఏర్పాటు చేయకుండా మి ఇబ్బందులు మీరే పడండనీ సెంటర్ల వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు.
తాజాగా
గుడిహత్నూర్ మండల కేంద్రంలో ని ఆధార్ సెంటర్ యాజమాన్యం ఇష్టనురాజ్యం* తమకు ఇష్టం వచ్చిన టైం లో వచ్చి గంట గంటకు బ్రేక్ టైం అంటూ ప్రజలకు ఇబ్బందికల్గిస్తున్నారు. ఆధార్ అప్డేట్ కోసం వచ్చిన మారుమూల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని ఆధార్ కేంద్రానికి వచ్చిన వారు పేర్కొన్నారు. వారు ఉదయమే ఆధార్ కార్డు అప్డేట్ కోసం వచ్చి ఆధార్ సెంటర్ లో పడిగాపులు కాస్తూ చంటి పిల్లలతో వేచి ఉన్నామని పరిగడుపుతో వచ్చినా కూడా ఇక్కడ ఆధార్ అప్డేట్ నత్తనడకనా చేస్తున్నారని , ఆధార్ సెంటర్ యాజమాన్యం తమ ఇష్టరితిగా ప్రవర్తిస్తున్నారాని మహిళాలు అని చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈ విషయం పై యాజమాన్యం పై పిర్యాదు చేస్తామని అనగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఎవరికి ఐన పిర్యాదు చేయండి అని అన్నారని ఆధార్ కార్డు దరఖాస్తుదారులు తెలియజేశారు.
ఇచ్చోడ మరియు ఇతర మండలాల్లో ఆధార్ అప్డేట్ కోసం వస్తున్న వారి నుండి నిర్ణీత రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక్కో అప్డేట్ కు 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు వసూలు జేస్తున్నర్రు.
అయితే ఈ అధిక వసూళ్ళలో పై అధికారులకు కూడా మామూలు మూటజెప్పడంతో అందుకే ఈ వైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు వాపోతున్నారు.
Recent Comments