epaper
Thursday, January 22, 2026

: Student and Teacher : టెన్త్ క్లాస్ స్టూడెంట్ తో టీచరమ్మ పాడు పనులు…

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!



ముద్దులు , కౌగిలింతలతో పోటో షూట్, పువ్వుతో ప్రపోజ్ సీన్… కట్ చేస్తే…

గురువే ప్రత్యక్ష దైవం… ఇది ఒకప్పటి మాట…

ఈ మధ్య గురువు దారి తప్పుతున్న సందర్భాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. విద్యార్థులకు పాఠాలు బోధించి వారిని భావి భారత పౌరులుగా తీర్చి దిద్దుతారు అనుకుంటే ఆ విద్యార్థులను వక్రబుద్దితో చూస్తూ… దారి తాప్పెల చేస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులు…

అయితే కర్ణాటక లో జరిగిన ఈ సంఘటన ఒకటి బయటపడింది….
టీచర్.. విద్యార్థితో దిగిన ఫొటోషూట్ పెను దుమారం రేపింది. స్టడీ టూర్‌లో భాగంగా టీచర్.. టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న తన స్టూడెంట్‌తో కలిసి రొమాంటిక్ ఫోజులిస్తూ..

ఫొటోలు దిగింది.. ప్రేమికుల మాదిరిగా ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయింది. స్టడీ టూర్‌లో భాగంగా కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఈ ఫోటోషూట్ జరిగింది. ఆ తర్వాత ఈ ఫొటోలు వైరల్ కావడంతో అధికారులు టీచర్ పై చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెన్త్ క్లాస్ విద్యార్థితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కర్ణాటక టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధ్యాయురాలు పుష్పలత ఆర్.. మురుగమల్ల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. అయితే, స్టడీ టూర్ లో భాగంగా ఉపాధ్యాయురాలు విద్యార్థిని కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం.. స్టూడెంట్ కూడా ఆమెను ఎత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం.. ఇలా ప్రేమికుల మాదిరిగా.. ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే, ఈ ఫొటోలను చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో షేర్ చేస్తూ.. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలంటూ మండిపడ్డారు. మైనర్ తో ఆ ఫోజులేంటి అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఫొటోషూట్ పై ఆగ్రహం వ్యక్తంచేసిన 10వ తరగతి బాలుడి తల్లిదండ్రులు టీచర్ ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. బీఈవో నివేదిక ఆధారంగా చిక్కబళ్లాపూర్‌ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డీడీపీఐ) బైలాంజినప్ప ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫోటోషూట్ గురించి పాఠశాల అధికారులు పుష్పలత ఆర్‌ని ప్రశ్నించగా.. ఇది తల్లి-కొడుకుల బంధం లాంటిదంటూ ఆమె వారికి చెప్పింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!