టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన ‘నిరుద్యోగ మార్చ్’తో ఓరుగల్లు కాషాయమమైంది. దీనికి భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు సహా ముఖ్య నేతలు నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కూడలి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు.
Thank you for reading this post, don't forget to subscribe!
పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం సహా నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేపట్టాలని నాయకులు, శ్రేణులు నినదించారు. పేపర్ లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని అన్నారు. తొలుత ఓరుగల్లులో చేపట్టిన నిరుద్యోగ మార్చ్… ఆ తర్వాత అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు.ఈ క్రమంలోనే కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కుటుంబం కోసం మాత్రమే ముఖ్యమంత్రి ఆలోచిస్తారని విమర్శించారు. విద్యార్థులు సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. పేపర్ లీకైన పరీక్షలు వెంటనే నిర్వహించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు
Recent Comments