రామకృష్ణాపూర్ ఏప్రిల్ 12 (రిపబ్లిక్ హిందుస్థాన్) : రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ కి చెందిన 20 మంది నిరుపేద కుటుంబలకు పరమ పవిత్ర రంజాన్ మసాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు ధనిక బీద అనే తేడా లేకుండా పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో జిఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్,ముఖ్య అతిథి ఏఐటియుసి అక్బర్ అలీ రంజాన్ తోఫ పంపిణీ చేయడం జరిగింది.అనంతరం డాక్టర్ రాజ రమేష్ బాబు మాట్లాడుతూ పరమ పవిత్రమైన మాసంలో తమ వంతుగా సహాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.ప్రతి ఒక్క ముస్లిం రోజంతా రోజా ఉంటూ ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఏ కోరికలైతే కోరుకుంటున్నారో ఆ అల్లా వారి కోరికలన్నీ నెరవేర్చాలని ప్రతి కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.అనంతరం అక్బర్ అలీ మాట్లాడుతూ జిఎస్ఆర్ ఫౌండేషన్ టీమ్ సభ్యులందరూ వారు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆ భగవంతుడు ఎల్లవేళలా వారికి తోడుండాలని కోరారు.రంజాన్ మాసంలో పేద కుటుంబాలకు రంజాన్ తోఫా ఇవ్వడం హర్షించదగ్గ విషయమని మున్ముందు డాక్టర్ రాజ రమేష్ బాబు ఇలాంటి సేవలు కొనసాగించాలని వారి కోరికలు అన్ని నెరవేరాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు రాజు,ప్రకాష్,ఉప్పులపు సురేష్,రమేష్,వంశీ,కిరణ్ పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!నిరుపేద ముస్లిం కుటుంబలకు రంజాన్ తోపా పంపిణి చేసిన డాక్టర్ రాజా రమేష్
Previous article
Next article
Recent Comments