రిపబ్లిక్ హిందుస్థాన్, దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వందుర్ గూడ గ్రామ పంచాయతీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కంటి వెలుగు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన వందుర్ గూడ గ్రామ పంచాయతీని రద్దు చేసి వేంకటపూర్ గ్రామ పంచాయతీ గానే కోన సాగించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మా డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకేళ్ళిన కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పెసా గ్రామ సభ అనుమతి లేకుండా గ్రామములో ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు చేపట్టకుడదన్నారు. ఇప్పటికే వందురు గూడ గ్రామ పంచాయతీ పేరుతో నిధులు దుర్వినియోగంకు పాలుపడిన అధికారులపై న్యాయ పోరాటం చేపట్టనున్నట్లు వారు తెలిపారు.
తమ ఆవేదనను అర్థం చేసుకోని వందుర్ గూడ గ్రామ పంచాయతీని రద్దు చేయాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, యంపిడిఒ, మేడికల్ అఫిసర్ దండేపల్లి,గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ కోవ దౌలత్ రావు మొకాశి, ఆదివాసి సేన జిల్లా అధ్యక్షులు కోట్నక తిరుపతి ఆదివాసి సేన మండల అధ్యక్షులు అత్రం జలపతి రావు ,గ్రామస్తులు భీం రావ్,తుల్సిరాం, ప్రమీల, రాంబాయి, పార్వతి బాయి, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments