◾️పుట్టినరోజు వేడుకలు క్యాన్సిల్ చేసి రోడ్డు పై గంటపాటు ధర్నా ◾️ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ అనుచిత వాక్యాలను, కేంద్రములోని బి.జె.పి ప్రభుత్వ కక్షపూరిత చర్యలను మానుకోకుంటే మరో ఉద్యమమేనంటు ధర్నాలో హెచ్చరించిన బోథ్ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక అంబెడ్కర్ చౌరస్తా లో కేంద్రములోని బి.జె.పి ప్రభుత్వ కక్షపూరిత చర్యలను, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఈడీ సిబిఐ ల ఏకపక్ష ధోరనిని, దుందుకుడు చర్యలను నిరసిస్తూ సుమారు గంటన్నర పాటు రోడ్డు పై బయటాయించి భారీ ధర్నాను నిర్వహించారు. ఇట్టి ధర్నా కార్యక్రమానికి ఆదివారం రోజు తన పుట్టిన రోజు సందర్బంగా వేడుకలను పూర్తిగా రద్దు చేసుకుని బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమములో 9 మండలాల కన్వీనర్లు,బి.ఆర్.ఎస్ ఎంపీపీలు,మార్కెట్ కమిటీ చైర్మన్లు,వైస్ చైర్మన్లు,రైతు బంధు అధ్యక్షులు,ఆత్మ చైర్మన్లు,బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి,మాజీ ఎంపీపీలు,పార్టి ఆయా విభాగాల బాధ్యులు,మహిళ నాయకులు,పెద్ద మొత్తములో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంటనే మా తెలంగాణ ఆడబిడ్డ ఐన ఎమ్మెల్సీ కవిత పై కేంద్రములోని బి జె పి ప్రభుత్వం,ప్రధాని నరేంద్రమోడీ కక్షపూరిత చర్యలను మానుకోవాలని, బండి సంజయ్ తొండి సంజయ్ లా తెలంగాణ అడపడుచును పట్టుకుని అడ్డమైన రీతిలో మాట్లాడడం శోచనీయమని,కనీసం ఆడబిడ్డ కు విలువ నివ్వని నీలాంటి వాళ్లను ఏ పదజాలంతో తిట్టిన తక్కువేనని, ED&CBI కేసులను వెంటనే వాపసు తీసుమోవాలని లేదంటే మరో ఉద్యమమేనని, కవితక్క పై కక్షపూరిత చర్యలకు నిరసనగా జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నందుకు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.


Recent Comments