రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ పాత్రికేయుని ఇంట్లో జరిగిన విందులో సోమవారం రాత్రి ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి, మరో హోంగార్డు విజయ్ ఇద్దరు జర్నలిస్టులపై భౌతిక దాడికి దిగడం పట్ల టియుడబ్ల్యూజే (హెచ్ 143 )తీవ్రంగా ఖండించింది. ఇచ్చోడుకు చెందిన కమురుద్దీన్ మరియు కొత్తూరు లక్ష్మన్ లపై ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి భౌతిక దాడికి దిగడంతో వారికి గాయాలయ్యాయి. మంగళవారం బోథ్ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు జిల్లా ఎస్పీని కలిసి ఎంపీపీ ఆగడాల గురించి భౌతిక దాడుల గురించి వివరించారు. వారిపై కేసు నమోదు చేయాలని హోంగార్డును సస్పెండ్ చేయాలని జర్నలిస్టు మిత్రులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బేత రమేష్ మాట్లాడుతూ వాస్తవ కథనాలు రాస్తున్న జర్నలిస్టులపై రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే జర్నలిస్టులు కూడా ప్రతిదాడులకు దిగాల్సి వస్తుందని తమకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లాలి తప్ప దాడులకు దిగడం సరికాదని హెచ్చరించారు. ప్రీతం రెడ్డి బూతు పదాలతో జర్నలిస్టుల ను దూషించడం సరికాదని, జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, ఇచ్చోడా, నేరడిగొండ, బజార్హత్నూర్, బోథ్ , మండలాలకు చెందిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులు పాల్గొన్నారు.
పాత్రికేయులపై దాడిని ఖండించిన టియుడబ్ల్యూజే
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments