అధ్యక్షునిగా లింగన్న, ప్రధాన కార్యదర్శి గా ఫిరోజ్ ఖాన్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా పాత్రిక ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎలుగు లింగన్న, ప్రధాన కార్యదర్శి గా ఫిరోజ్ ఖాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని సాక్షర దిన పత్రిక కార్యాలయం లో ఆదిలాబాద్ జిల్లా పత్రిక ఎడిటర్ ల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యుల సూచనల మేరకు నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఎడిటర్స్ అసోసియేషన్ కార్యవర్గంలో సలహా కమిటీ బాధ్యులుగా శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్ కరీం, సందేశ్ భరద్వాజ్, శాఫీల్లాఖాన్, గౌరవ అధ్యక్షులు గా డివిఆర్ ఆంజనేయులు, ఉపాధ్యక్షులు గా నరేష్, రాజు రాథోడ్, సంయుక్త కార్యదర్శులు గా, ఎల్చల్ వార్ సత్యనారాయణ, ఖమర్, ట్రెజర్ గా సంతోష్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక పత్రికల ఎడిషన్ కార్యాలయాలకు ప్రభుత్వ సహకారం, డబుల్ బెడ్ రూమ్, ఇండ్ల స్థలాలు కేటాయింపు తదితర కార్యాచరణ అంశాలపై చర్చించారు.


Recent Comments