దేశంలోనే ఆదిలాబాద్ జిల్లా సురక్షితమైనది
Thank you for reading this post, don't forget to subscribe!◾️ రిపోర్టు విడుదల చేసిన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి*
◾️దేశ ప్రజలకు ఆదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లా
◾️తెలంగాణలో మొదటి స్థానాన్ని, దేశంలో 5వ స్థానాన్ని దక్కించుకున్న ఆదిలాబాద్ జిల్లా
◾️సామాజిక ప్రగతి సూచికలో 85 మార్కులతో దేశంలోని ఐదవ స్థానాన్ని రాష్ట్రంలో మొదటి స్థానాన్ని ఆదిలాబాద్ జిల్లా కైవసం చేసుకుంది…
◾️జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లాగా మాత్రమే పేరు ఉండేది కానీ ప్రజాజీవనం కొనసాగించడానికి ఈ జిల్లా శాంతియుతమైన జిల్లా అని మరోసారి రుజువు అయింది.
శనివారం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ద్వారా సామాజిక ప్రగతి సూచిక, సురక్షితమైన జిల్లాల నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 85 మార్కులతో ఆదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లాగా దేశంలో ఐదవ స్థానాన్ని తెలంగాణలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ సర్వే నందు 89 సూచికలను పరిగణలోకి తీసుకున్నారు, అందులో ముఖ్యమైనవి మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, సైబర్ క్రైమ్, హత్యలు, రోడ్డు మరణాలు, హింసాత్మక నేరాలు తదితర అంశాలను వ్యక్తిగత భద్రత పరిమితిని లెక్కించేందుకు పరిగణలోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ద్వారా విడుదల చేసిన ఈ నివేదికలో ఆదిలాబాద్ జిల్లా మారుమూల జిల్లా అయినప్పటికీ మార్కులు సంపాదించే పారామీటర్లలో ఆదిలాబాద్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపాయి. తెలంగాణ వ్యక్తిగత భద్రత స్కోరు 42 గా ఉండగా ఆదిలాబాద్ జిల్లా వ్యక్తిగత భద్రతా స్కోరు 85 గా ఉండి రాష్ట్రానికే గర్వకారకం గా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనంగా ఈ భద్రత ర్యాంకింగ్స్ రావడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డికి ప్రముఖుల ద్వారా అభినందనలు వెల్లువెత్తాయి. ఈ ర్యాంకింగ్ లో నాగాలాండ్ లోని మొకొక్ జిల్లా 89.89 మార్కులతో అగ్రస్థానంగా ఉండగా, తెలంగాణలో కరీంనగర్ జిల్లా 81 మార్కులతో రెండవ స్థానం లో ఉంది. సామాజిక ప్రగతి సూచికలో మూడు కోణాలలో ప్రజల కనీస అవసరాలు, మంచి మనిషిగా తీర్చిదిద్దేందుకు కావలసిన పునాదులు, మరియు కొత్త అవకాశాలు ప్రతి ఒక్క కోణంన్ని నాలుగు విభాగాలుగా విభజించి సూచికను తయారు చేస్తారు.

Recent Comments