మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికా సమావేశం లో వివరాల వెల్లడి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జల్సాలకు అలవాటు పడి దోపిడీ దొంగగా మారిన బిటెక్ విద్యార్థిని మావల పోలీసులు అరెస్ట్ చేశారు.
మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికా సమావేశం లో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఉట్నూర్ మండలం యెంద గ్రామానికి చెందిన నిందితుడు శివకరణ్ కాగ్నే (22) అనే యువకుడు పంజాబ్ లోని ఎల్ పి యు యూనివర్సిటీలో 2018 సంవత్సరం లో బిటెక్ (సైబర్ సెక్యూరిటీ) లో జాయిన్ అయినాడు. అక్కడ స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడి ఇంటి నుండి పంపే డబ్బు సరిపోనందున ఎలాగైనా తక్కువ సమయం లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అవకాశం కోసం ఎదురుచూశాడు. అదే సమయంలో అదిలాబాద్ లోని ప్రముఖ బట్టల షాప్ ఓనర్ సాయి యొక్క మొబైల్ నంబరును తెలుసుకుని అతన్ని జిఎస్టీ ఏ టి ఎస్, ఐటి అధికారిని అని బెదిరింపులకు గురిచేసి అతన్ని అదిలాబాద్ లోని ఒక లాడ్జ్ కు తీసుకు వెళ్ళి, సుత్తితో తలపై కొట్టి తాడుతో చేతులు, కాళ్ళు కట్టేసి భయభ్రాంతులకు గురిచేసి అతన్ని మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురిచేసి, తేదీ 31.10.2022 రోజున మళ్లీ బట్టల షాప్ ఓనర్ ను అతని కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించి రూ.5.00 లక్షలు డిమాండ్ చేయడంతో అతడు వెంటనే డబ్బులు సర్దుబాటు చేయడంతో నిందితుడు డబ్బులు తీసుకొని పరారు అయ్యాడు. తేదీ 01.11.2022 రోజున మావల పోలీస్ స్టేషన్ యందు పిర్యాదు మేరకు కేసును నమోదు చేసి కేసు విచారణ చేపట్టి, సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుని యొక్క ఆచుకి తెలుసుకొని యస్. పి. ఆదిలాబాద్ ఉత్తర్వు మేరకు డి ఎస్పీ ఆదిలాబాద్ పర్యవేక్షణలో స్పెషల్ టీమ్ , సిఐ ఆదిలాబాద్ రూరల్ బి.రఘుపతి, ఇన్స్పెక్టర్ సిసి ఎస్ చంద్రమౌళి ల ఆధ్వర్యంలో శనివారం రోజు నేరస్తుడిని పట్టుకొని విచారించగా తాను చేసిన నేరం ఒప్పుకొని బాదితుని నుండి తాను తీసుకొని వెళ్ళిన రూ.5 లక్షల నుండి రూ.60 వేల తో లతో మొబైల్ ఫోన్ కొనుక్కొని కొన్ని డబ్బులు తన అవసరమునకు వాడుకుని జల్సా చేసుకోనగా మిగితా డబ్బులు రూ.3,35,000/-, నేరానికి ఉపయోగించిన తాడు, సుత్తి, కత్తి మరియు సిమ్ కార్డ్ లను మరియు యాపిల్ ఫోన్ ని నేరస్థుని దగ్గరి నుండి జప్తు చేసుకున్నాము. అతను నేరానికి వాడిన సెల్ ఫోన్ వేరే చోట దాచి పెట్టినాడని ఒప్పుకున్నాడు వాటిని కూడా త్వరలో జప్తు చేస్తాము.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments