రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఇచ్చోడ మండల పరిధిలోని టీచర్స్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన కలకలం రేపింది. రెండు రోజుల నుండి ఇంటి యాజమానులు ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు గోడ దూకి ఇంటి తాళం పగలగొట్టి దాదాపు రెండు లక్షల రూపాయల నగదు, కార్ అదనపు కీ ఎత్తుకుపోయారు. సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్న యాజమానులు పగిలి ఉన్న తాళాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Comments