ప్రమాదాలకు నిలయంగా జాతీయ రహదారి…! అర్ధరాత్రి జరిగిన ఘటనా స్థలంలోనే మరో ప్రమాదం…!!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదివారం అర్థరాత్రి గుడిహత్నూర్ మండలం సీతాగొంది జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన చోటే మరో ప్రమాదం సంభవించింది. హైద్రాబాద్ నుండి నాగపూర్ వెళ్తున్న వాహనాలు అదుపు తప్పి ఒకదానికి ఒకటి వరుసగా మూడు కంటైనర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాద స్థలంలోనే ఇప్పుడు మరో ప్రమాదం జరగడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి ములమలుపు వద్ద ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం, ఎత్తైన కొండ ప్రాంతం వద్దనే ములమలుపు ఉండడంవల్లనే తరచు ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే జాతీయ రహదారి నిర్మాణంలోనే లోపాలు ఉన్నట్లు స్పష్టం గా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. సీతా గొంది పరిసర ప్రదేశాల్లో తరుచు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నయి. జాతీయ రహదారి అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Recent Comments