Sunday, August 3, 2025

తెరాస లో ముదిరిన అంతర్గత పోరు….

◾️ ఆదిలాబాద్ జిల్లాలో తెరస పార్టీకి ప్రతిపక్ష పార్టీ అవసరం లేకుండా ఒక పార్టీలో రెండు వర్గాలు…. ఒకరి పై ఒకరు విమర్శలు

◾️ ఎమ్మెల్యే వర్గం …. మాజీ ఎంపీ వర్గం మధ్య మొదలైన మాటల యుద్ధం…

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తెరాస పార్టీ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను అదే పార్టీ కి చెందిన నాయకులు పదే పదే కించపరిచేలా మాట్లాడటంతో ఎమ్మెల్యే వర్గం నాయకులు మరియు ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు పాత్రికేయ సమావేశం లో మాజీ మంత్రి తెరాస మాజీ ఎంపీ అయినా గోడం నగేష్ వర్గం పై మాటల యుద్ధం మొదలు పెట్టారు.
శుక్రవారం జరిగిన మాజీ ఎంపీ గోడం నగేష్ పుట్టినరోజు కార్యక్రమంలో అక్కడ కొంతమంది నాయకులు ఎమ్మెల్యే ను పరోక్షంగా విమర్శించడంతో ఎమ్మెల్యే వర్గం నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. స్వపక్షం లో ఉంటు విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్బంగా పార్టీ కన్వీనర్లు ఇచ్చోడా లో నిర్వహించిన ప్రెస్మిట్ లో మాట్లాడుతూ
శుభకార్యం ముసుగులో నీచ* *రాజకీయాల?ప్రజా భలమున్న బహుజన, గిరిజన నాయకునిపై అనుచిత వాక్యాలు చేస్తే ఖబడ్ధార్……ముక్తకంఠముతో  నాలుగు మండలాల కన్వీనర్ల హెచ్చరిక
లు చేశారు.  శుక్రవారం రోజు ఒక కార్యక్రమం వేదికగా ఎమ్మెల్యే పై చేసిన అనవసరపురాద్ధాంత రాజకీయాలను ఇచ్చోడ, గుడిహత్నూర్, బోథ్,బాజార్ హత్నూర్ మండల కన్వీనర్లు ఏనుగు కృష్ణ రెడ్డి, కరాడ్ బ్రహ్మానందం,సోలంకి రుక్మాన్ సింగ్,కానిందే రాజారామ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా కన్వీనర్లు మాజీ ఎంపీగా,మాజీ మంత్రి గా మిమ్మల్ని మేము ఎంతో గౌరవిస్తాం కానీ, మీరు మీ పుట్టిన రోజును అడ్డంగా పెట్టుకుని ఇంత దిగజారుడు రాజకీయాలు చేసి తెరాస పార్టీలో ఉంటూనే పార్టీ ప్రతిష్టను దిగజార్చిన మిమ్మల్ని,మీ అనుచర ఘనాన్ని చూస్తే జాలేస్తుంది, ఒక ప్రస్తుత ఎమ్మెల్యేను పట్టుకుని నోరు జారీ మాట్లాడి మీ అనుభవాన్ని కూడా అబసుపాలు చేసుకున్నారని అన్నారు.   మీరు అంతకు ముందు ఎన్నికల్లో గాని,గత ఎన్నికల్లో గాని రాథోడ్ బాపురావు  గెలుపు కోసం ఏనాడు కృషి చేయలేదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజలే ఆయనకు శ్రీరామ రక్షగా ఉన్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలే తనకు కంచుకోటాగా నిలుస్తారని హితవుపలికారు.    కన్న తల్లిలాంటి పార్టీకే పంగానామాలు పెట్టాలని చూసే  మిమ్మల్ని ఏమనాలి? ఐన మీ సంగతులన్ని అధిష్టానానికి తెల్సిన విషయమే అన్నారు.                   ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకి ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను,అనునయత్వాన్ని తట్టుకోలేక భుజాలు తడుముకుంటు,బురదజల్లే రాజకీయాలు చేస్తే ఇక ముందు మా తడాఖా చుహిస్తామంటూ హెచ్చరించారు.                        మీరు తెరాస కార్యకర్తలు అయితే మిలో ఒకరన్న నిన్నటి మీ కార్యక్రమములో గులాబీ ఖండువ వేసుకున్నారా…?   అని ప్రశ్నించారు. మీ ధింపుడు కళ్లెం ఆశలు వదులుకొని, ఉంటే నిజాయితీగా పని చేయండి లేదా మీ తోవ మీరు చూసుకోండి, లేదంటే మేమే త్వరలో అధిష్టానానికి పిర్యాదు చేస్తాం అంటూ హెచ్చరించారు.  ఏది ఏమైనా ప్రజలు, అధిష్టానం రాథోడ్ బాపురావు  వెంటే ఉన్నారని, ఇక ముందు అనవసర వాక్యాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇచ్చోడలో నిర్వహించిన ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా సమావేశములో ముక్తకంఠంతో హెచ్చరించారు.ఈ కార్యక్రమములో ఏ.ఎమ్.సి బోథ్ వైస్ చైర్మన్ గుంజాల భాస్కర్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మెంబెర్ తాహెర్ బిన్, నర్సారెడ్డి,అబ్దుల్ రషీద్,రైతు బంధు అధ్యక్షులు ముస్తఫా,మాజీ ఎంపీపీ సత్యరాజ్, రాథోడ్ ప్రవీణ్, బుచ్చన్న, ఎంపీటీసీ నారాయణ్, బొడ్డు శ్రీనివాస్, రెడ్డి,బుచ్చన్న,ఆనంద్,ఆకాష్,లక్ష్మణ్,అంకుష్,బిరం రవి తదితరులు పాల్గొన్నారు.

తెరాస నాయకులు సరక్యూలెట్ చేస్తున్న వీడియోలు

Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి