🔶 ఫిర్యాదులకు అన్ని వేళలో ఒకే విధమైన జవాబుదారీగా వ్యవహరించాలి…
— జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి
🔶 బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ :
సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగించి, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేయాలని జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సిఐ ఎం నైలు, ఎస్ఐ ముజాహిద్ పుష్ప గుచ్చం అందించి జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు.

సాయుధ పోలీసులతో ఏర్పాటుచేసిన గౌరవ వందనంను స్వీకరించారు. అనంతరం అధికారులతో కలిసి పోలీసు స్టేషన్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులను సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో నిందితులను ప్రవేశ పెట్టాలన్నారు, బాధితులకు సంపూర్ణ న్యాయం చేసే విధంగా పోలీసులు జవాబుదారీగా పనిచేయాలని సూచించారు, అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ముందస్తుగా తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు, రాత్రి సమయంలో పెట్రోలింగ్, గస్తీ అదనంగా ఏర్పాటు చేసి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు, రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు, పోలీస్ స్టేషన్ రికార్డులను క్రమబద్ధీకరించే విధంగా 5ఎస్ విధానంను అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ ఎం.నైలు, బజార్హత్నూర్ ఎస్సై ముజాహిద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments