ePaper
Saturday, April 11, 2026
📄 ePaper

అర్థరాత్రి…… ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

📰 Generate e-Paper Clip

🔶 రూ 69,141/- నగదు, పేకాట ముక్కలు స్వాధీనం, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

🔶 అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన సిసిఎస్ పోలీసుల బృందం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదివారం అర్ధరాత్రి ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాపూర్ గ్రామ శివారులో ఒక పంట పొలం లోని కొట్టం లో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం దాడిచేయగా ఏడుగురు పేకాట ఆడుతుండగా సంఘటన స్థలంలో పడ్డారని తెలిపారు. పట్టుబడ్డ నిందితుల వివరాలు
1) యూనిస్.
2) దశరథ్.
3) కిషోర్.
4) గౌస్.
5) సద్దాం.
6) ఎస్కె అబ్బాస్.
7) ఎస్కే హుస్సేన్.
వీరందరూ ఇంద్రవెల్లి గ్రామానికి మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారని సిఐ గారు తెలిపారు. వీరి వద్దనుండి పేకాట ముక్కలు, రూ 69,141/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తదుపరి విచారణ నిమిత్తం వీరిని స్టేషన్ నందు అప్పజెప్పినటు వివరించారు. ఈ ఆపరేషన్ నందు సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!