రిపబ్లిక్ హిందుస్థాన్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గోపయ్య పల్లె గ్రామానికి చెందిన విశ్రాంతి సింగరేణి ఉద్యోగి దాత శంకరయ్య, ధాత కనకలక్ష్మి భార్యభర్తలు ఇద్దరు కలిసి పనుల అవసరాల నిమిత్తం పెద్దపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో పెద్దమ్మ నగర్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో దాత శంకరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. దాత కనకలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Recent Comments