ఒక ట్రాక్టర్, రూట్వేటర్ రికవరీ*
నెల రోజుల లోపే కేసును ఛేదించిన స్పెషల్ టీం
— వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డిఎస్పి వి. ఉమేంధర్
స్పెషల్ టీం ను ప్రత్యేకంగా అభినందించి, రివార్డులు ప్రకటించిన జిల్లా ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం సాయంత్రం స్థానిక ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఆదిలాబాద్ డిఎస్పి వి ఉమేంధర్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో డిఎస్పీ మాట్లాడుతూ బాధితుడు దొంతుల గంగారెడ్డి పొన్నారి గ్రామానికి చెందిన వ్యక్తి గత నెల 20వ తారీఖున తాంసీ పోలీస్ స్టేషన్ నందు మే నెల 16 వ తారీకు అర్ధ రాత్రి పొన్నారి గ్రామ శివారు నుండి తన ట్రాక్టర్, రోటవేటర్ దొంగతనం చేయబడిందని ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. దీనిపై తాంసీ పోలీస్ స్టేషన్ నందు క్రైం నంబర్ 38/2022, U/Sec 379 IPC కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దొంగతనం జరిగిన కేసులో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక స్పెషల్ టీం ను నియమించడం జరిగిందని, ఈ స్పెషల్ టీం నందు ఎస్ఐ సునీల్, సిబ్బంది జగన్ సింగ్, కరీం నియమించబడ్డారు. వీరు నిన్న సాయంత్రం అంకానీ గ్రామం, మనొర తాలూకా, మహారాష్ట్ర నందు నిందితులను పట్టుకొని అరెస్టు చేసి విచారించగా దొంగిలించబడిన ట్రాక్టర్ ,రోటవేటర్ వివరాలు తెలిపి వాటిని తీసుకురావడం జరిగిందని తెలిపారు.
*నిందితులు*
A1) పంకజ్ @ గోలే బలరాం రాథోడ్, మహారాష్ట్ర.
A2) బర్జు మనిక్ రాథోడ్ , మహారాష్ట్ర.
కు చెందిన వారు. వీరు పొన్నారి గ్రామంలో దొంగతనానికి ముందు ఒకరోజు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు అని గ్రామస్తులను విచారించగా తెలిపారు. వీరిద్దరిని పట్టుకున్న స్పెషల్ టీం సభ్యులను జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుకున్న ట్రాక్టర్ విలువ దాదాపు మూడు లక్షల 90 వేల రూపాయలు విలువ చేస్తుందని తెలిపారు. ఈ సమావేశం నందు రూరల్ సిఐ బి రఘుపతి, ఎస్సైలు ఎ హరిబాబు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments