— సిసిఎస్, స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కొనసాగిన దాడి
— రూ. 52,000/- నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం, తాంసీ పోలీస్ స్టేషన్లో ఎనిమిది మందిపై కేసు నమోదు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తాంసి మండలం పొన్నారి గ్రామ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో పేకాట ఆడుతున్న టు విశ్వసనీయ సమాచారం మేరకు సిసిఎస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ల సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 8 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వీరి పై పై తాంసీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి, నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు, మిగిలిన నలుగురు పారిపోయారని సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి తెలిపారు.

పేకాట ఆడుతూ పట్టుబడిన వారి వివరాలు
1) సౌదీ వార్ రమేష్
2) ఎనగందుల రాకేష్
3) ముదిగొండ జయచంద్ర హరి
4) తుమ్ముల అభిలాష్
5) కళ్ళ సాయికృష్ణ
6) భోస్లే రవి
7) గుమ్ముల అనిల్
8) ఆరే రాజు.
వారి వద్దనుండి 54 వేల రూపాయలు మరియు 3 చక్రాల వాహనాలను,5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తాంసీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఈ ఆపరేషన్లో సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ జె కృష్ణమూర్తి, ఎస్సై రమేష్, సిబ్బంది గంగారెడ్డి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments