🔶 పట్టణంలో గుట్కా,మట్కా, గంజాయి పూర్తిగా రూపుమాపడమే ప్రధాన లక్ష్యం
🔶 కలిసికట్టుగా పనిచేసి జిల్లా పోలీసు వ్యవస్థను ఉన్నత స్థానానికి తీసుకు రావాలి
🔶 ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్ట్ పాత్ర చాలా కీలకమైనదని జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని ఆదిలాబాద్ రెండవ పోలీస్స్టేషన్ ను జిల్లా ఎస్పి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మొదటగా స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ ను తనిఖీ చేసి అక్కడ జరిగే కార్యచరణను గురించి రిసెప్షన్ సెంటర్ అధికారులను విచారించారు, ఈ సంవత్సరం వచ్చిన పిటిషన్స్ వివరాలను విచారించి వాటి స్థితిగతులపై సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరినీ మర్యాదపూర్వకంగా పలకరించి సత్వర న్యాయం చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఆన్ క్లైమెడ్ వెహికల్స్ వివరాలను, పార్క్ చేసిన వెహికల్స్ వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. తదుపరి సిబ్బందితో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కలిసికట్టుగా పని చేసినప్పుడే ఆదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థను ఉన్నత స్థానానికి తీసుకురా గలము అని, దానికి పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి విధులను సక్రమంగా నిర్వహించిన్నపుడే అది సాధ్యం అవుతుందని తెలిపారు.

సిబ్బంది అందరినీ వారు చేస్తున్న విధులను అడిగి తెలుసుకొని వారికి తగు సూచనలు చేశారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా,మట్కా, గంజాయి పూర్తిగా అంతమొందించే దిశగా ప్రతి ఒక్కరు శ్రద్ధగా పనిచేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో రిసెప్షన్, బ్లూ కోట్, పెట్రో కార్, సెక్షన్ ఇంచార్జ్ విధులు కీలకమైనవని వీటిని సక్రమంగా నిర్వహించినప్పుడు వర్టికల్ స్ లో ఆదిలాబాద్ జిల్లాలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఉత్తమ ప్రదర్శన కలిగి ఉంటుందని తెలిపారు. డయల్ హండ్రెడ్ కాల్ వచ్చినప్పుడు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రతతో ఉంచుకోవాలని అని సూచించారు. ఒకప్పటి పోలీసు వ్యవస్థకు ఇప్పటి పోలీసు వ్యవస్థకు చాలా తేడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పనితీరును, ప్రజల పట్ల ప్రవర్తనను ఎల్లప్పుడూ పరిశీలిస్తుందని దానిని దృష్టిలో పెట్టుకుని మన కర్తవ్యాన్ని సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెండవ పట్టణ సీఐ కే శ్రీధర్, ఎస్సైలు వి విష్ణువర్ధన్, కె విష్ణు ప్రకాష్, ఎఎస్ఐ అనిత, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments