Friday, November 22, 2024

క్షయ(టిభి)” భయం వద్దు…


ఎన్ డి టి ద్వారా పూర్తిగా నయం


క్రమం తప్పకుండా చికిత్స చేయించుకోవాలి


క్షయ అంటే చాలా మంది భయపడతారు కానీ

ప్రస్తుతం ఎన్.డి.టి.వి చికిత్స అందుబాటులోకి వచ్చిన వారు భయపడవలసిన అవసరం లేదు. టిబి ఎవరికైనా రావచ్చు ముఖ్యంగా టీవీ వచ్చిన వారికి లక్షణాలు జ్వరం మూడు వారాలు దగ్గు బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి వీటి వెంటనే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినట్లయితే టిబి పరీక్ష ఉచితంగా చేస్తారు ఒకవేళ నిర్ధారణ అయినట్లయితే ప్రభుత్వం ఉచితంగా మందులను సరఫరా చేస్తుంది దీనితోపాటు పౌష్టికాహారం కొరకు ప్రభుత్వం నెల నెల కొంత డబ్బు కూడా ఇస్తుంది చాలామంది టిబి వచ్చింద అంటే భయపడతారు . ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ సందర్భంగా కొడం నరేష్ ఆరోగ్య జ్యోతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అందించిన వ్యాసం
ఈరోజు (మార్చ్ 24 న ) ప్రపంచ క్షయ నివారణ దినం గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.సూక్ష్మజీవులు మనుషులను చంపగలగడం ప్రకృతి విచిత్రము . మానవ శరీరము అనేక వేల రకాల సూక్ష్మజీవులకు ఆశ్రయమిస్తుంది . వీటిలో కొన్ని ప్రాణాంతక జీవులు . అటువంటి ప్రాణాంతకజీవులకు సమాజము వణికిపోతుంది . అందులో ఒకటి హెచ్.ఐ.వి . వైరస్ ద్వారా సోకే ” ఎయిడ్స్ ” కాగా రెండెవది బ్యాక్టీరియా వల్ల వచ్చే ” క్షయ(టి.భి)” వ్యాది .

క్షయవ్యాధి రావడానికి కారణమైన మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యూ లోసిస్‌ క్రిమిని 24 మార్చి 1882లో జర్మనీ దేశానికి చెందిన ‘రాబర్ట్‌కాక్‌’ (జీవితకాలం 1843- 1910) అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఆనాటి నుంచి ఇదే రోజున ప్రతి సంవత్స రం ప్రపంచ క్షయ నివారణ దినంగా పాటిస్తున్నారు.క్షయ క్రిమిని కనుగొన్నందుకుగాను రాబర్ట్‌కాక్‌కు 1905లో నోబెల్‌ పురస్కారం కూడా లభించింది. ఆయన చేసిన సేవకు గుర్తింపుగా క్షయ వ్యాధిని వైద్యరంగంలో ‘కాక్స్‌ డిసీజ్‌’ అని కూడా పిలుస్తుంటారు. క్షయ భయంకరమైన అంటువ్యాధి.మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య ప్రాణాంతక సమస్య ‘క్షయ’. ముఖ్యంగా క్షయ మైకో బ్యాక్టీరియం ట్యూబర్‌క్యూలోసిస్‌ అనే సూక్ష్మ క్రిమి ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది స్త్రీ, పరు షులనే తారతమ్యం లేకుండా ఏ వయస్సులోనైనా, ఎవరి కైనా రావచ్చును. అయితే క్షయ శరీరంలో (తలవెంట్రు కలు, గోళ్ళు తప్ప) రక్తప్రసరణ ఉన్న ఏ భాగానికైనా రావచ్చును. క్షయ క్రిమికి ఆక్సిజన్‌ అవసరం కాబట్టి సాధారణంగా ఇది ఆక్సిజన్‌ ఎక్కువగా లభించే ఊపిరితి త్తులకు (పల్మనరీ టి.బి) సోకుతుంది. దీనినే శ్వాసకోస అని అంటారు. ఊపిరితిత్తులకు కాకుండా ఇతర శరీర భాగాలకు సోకే క్షయను ఎక్స్‌ట్రాపల్మనరీ టి.బి అని అంటారు. క్షయ వ్యాధి సాధార ణంగా బీదవారిలో, అత్యధిక జనసమ్మర్థం (సినిమా హాలు, జాతర) ఎక్కువగా ఉన్నచోట్లలో నివసించే వారిలో, మురికి వాడలో నివసించే వారిలో అధికంగా ఉంటుందని పరిశీల నలో వెల్లడైంది.

క్షయ వ్యాధి తీవ్రత, మరణాలు
ప్రపంచంలోని 5వ వంతు క్షయ కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి. ప్రతిరోజూ 5వేల మంది క్షయ వ్యాధికి గురవుతున్నారు. సంవత్స రానికి 18 లక్షల మందికి క్షయ సోకుతుంది. భారత్‌లో సుమారు 34 లక్షల మంది క్షయ వ్యాధితో బాధ పడుతు న్నారు. అలాగే మన భారతదేశంలో ప్రతి 3 నిముషాలకు ఇద్దరు, సగటున రోజుకి దాదాపు 1500 మంది, సంవత్సరానికి 5 లక్షల మంది క్షయవ్యాధితో మరణిస్తు న్నారు. మన రాష్ట్రం లో 15 నిముషాలకు ఒక క్షయ రోగి మరణిస్తున్నాడు. రాష్ట్రంలో సుమారు 1.08 లక్షల మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అంచనా. సంవత్సరానికి సుమారు 30 వేల మంది ఈ వ్యాధితో మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 30 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచంలోని చైనా తర్వాత మన భారతదేశంలోనే అత్యధికం గా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందిన క్షయ రోగులు, మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

క్షయవ్యాధి లక్షణాలు – వ్యాధి నిర్ధారణ :
ఈ వ్యాధి ఉన్న వారికి రెండు వారాలకు మించి ఎడతెరిపిలేని దగ్గు, సాయంత్రంపూట జ్వరం రావటం, ఆకలి తగ్గటం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గటం, ఉమ్ములో రక్తం పడటం, కళ్లె (తెమడ) పడటం, ఆయాసం, త్వరగా అలసిపోవడం, రాత్రి పూట బాగా చెమటలు పట్టడం, నిద్రపట్టకపోవడం, రోగి అస్థిపంజరంలా మారడం మొదలగునవి. క్షయ క్రిమితో చిక్కేమిటంటే ఇది శరీరంలో ప్రవేశించిన వెంటనే వ్యాధి రూపందాల్చడు. సుమారు 95 శాతం మందిలో రోగ నిరోధక వ్యవస్థ దీనిపై సమర్థంగా పోరాడి క్షయ వ్యాధి రాకుండా అడ్డు కుంటుంది. 5 శాతం మందిలో మాత్రం ఇది రూపాంతరం చెందుతుంది. కొందరిలో ఈ క్రిమి నిద్రా ణంగా ఉండిపోయి వారిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీన పడినప్పుడు విజృంభిస్తుంది. ముఖ్యంగా హెచ్‌ఐవి కారణంగా గానీ, పోషకాహార లోపం ఇతర కారణాల వల్ల వ్యాధి నిరోధక శక్తి క్షీణించినపుడు క్షయ వ్యాధి లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. కాబట్టి క్షయ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే వ్యాధిని నయం చేయవచ్చు. ఎవరికైనా క్షయ సోకిందేమోనన్న అనుమానం ఉన్న వారికి (డిఎంసి) డిజిగ్నేటెడ్‌ మైక్రోస్కోపీ కేంద్రాల ద్వారా మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుతప్రతులలోను, వైద్య కళాశాలలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ కళ్లె (తెమడ) రెండుసార్లు అక్కడికక్కడే ఒకసారి, మరుసటి రోజు ఉదయాన్నే ఒకసారి, ఛాతీ ఎక్స్‌రే క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఎక్స్‌రే సౌకర్యాలు ఉన్నచోట్ల ఎక్స్‌రేలు తీస్తారు. ఇటీవల కాలంలో మందులకు లొంగని మొండి క్షయను గుర్తించడానికి ఖచ్చితంగా నిర్ధారించే కొత్త పరీక్షలు అందుబాటు లోకి వచ్చాయి

క్షయ అంటువ్యాధా? ఎయిడ్స్‌ / క్షయ పరస్పర సంబంధం :
ముఖ్యంగా క్షయ తీవ్రమైన అంటు వ్యాధి. క్షయ వ్యాధి గ్రస్తులు దగ్గినప్పుడు, ఉమ్మినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు క్షయ రోగ క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లుగా వదలడం (ఎయిర్‌బోర్న్‌ ఇన్‌ఫెక్షన్‌) జరుగు తుంది. ఈ సూక్ష్మమైన తుంపర్లు ఆరోగ్యవంతులు శ్వాస ద్వారా పీల్చేటప్పుడు 10 శాతం క్షయ వ్యాపిస్తుంది. చికిత్స పొందని బాసిలస్‌ క్రిములు కలిగి ఉన్న (స్పూటమ్‌ పాజిటివ్‌) ఒక క్షయ వ్యాధిగ్రస్తుడు ఒక సంవత్సరంలో కనీసం 10 నుంచి 15 మందికి క్షయ వ్యాధిని వ్యాపింపచేయగలు గుతారు. కాబట్టి క్షయ రోగులు దగ్గేటప్పుడు నోటికి దట్ట మైన గుడ్డను అడ్డుగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయరాదు. అలాగే ఎయిడ్స్‌ దశలో ఉన్న వ్యక్తులకు వచ్చే అవకాశపరమైన వ్యాధులలో క్షయ ప్రధానమైంది. భారతదేశంలో నివసించే హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తు లలో సుమారు 50 నుంచి 60 శాతం క్షయ వ్యాధికి గురవుతున్నారు. క్షయ వ్యాధితో ఎయిడ్స్‌ సోనిక వారి జీవితకాలం గణనీయంగా తగ్గుతుంది. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులలో 3వ వంతు మంది కేవలం క్షయ వ్యాధి తోనే మరణిస్తున్నారు. క్షయ అంటువ్యాధి కాబట్టి క్షయ రోగులు ఇంట్లో ఉన్నంతకాలం క్షయవ్యాధి తీవ్రత తగ్గేంత వరకు కుటుంబ సభ్యులు పిల్లల్ని మరీ దగ్గరకు వెళ్ళకుండా చూడడం. రోగిని వేరే గదిలో ఉంచడం, భోజనం చేయడానికి తన ప్లేటును, గ్లాసును ప్రత్యేకంగా ఉంచుకోవాలి. క్షయవ్యాధిగ్రస్తులున్న ఇంట్లోని 6 సంవత్సరాలలోపు పిల్లలకు డాక్టర్‌ గారి సలహా మేరకు మందులు ఇప్పించాలి. రోగికి సేవలందిస్తూ మనల్ని మనం క్షయ వ్యాధికి గురికాకుండా చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

క్షయ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి మందులు ఉన్నాయా? :
మన దేశంలో 1962లో జాతీయ క్షయవ్యాధి నివారణా కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ అనుకున్న ప్రగతి సాధించలేకపోయింది. తరువాత వ్యాధిని పూర్తిగా నియంత్రించడానికి ప్రపంచ ఆరోగ్యయ సంస్థ 1992లో ఒక ప్రత్యేక శక్తివంతమైన స్వల్పకాలిక చికిత్సా విధానాన్ని రూపొందించింది. దీనినే డాట్స్‌ పద్ధతి అని అంటారు. ఈ డాట్స్‌ పద్ధతిలో శిక్షణపొందిన డాట్‌ ప్రొవైడర్స్‌ ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న క్షయ రోగులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ వ్యాధి దశను బట్టి 6/7 నుంచి 8/9 నెలలు చికిత్సకు అవసరమైన నాణ్యత కలిగిన డాట్స్‌ మందులను తమ సమక్షంలోనే దగ్గర ఉండి మందులు మింగించడం, వ్యాధి పూర్తిగా నయం అయ్యేలా చూడటం ఈ విధానం ప్రత్యేకత. ఈ విధానం వలన క్షయరోగులు మందులను మధ్యలో మానివేసే అవకాశం తగ్గుతుంది. దీని వలన వ్యాధి తొందరగా నయమవ్వడమే కాకుండా క్షయ వ్యాధిగ్రస్తుల ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం కూడా తగ్గుతుంది. క్షయ వ్యాధిని పూర్తిగా అరికట్టడంలో డాట్‌ ప్రొవైడర్స్‌ పాత్ర చాలా కీలకమైంది. ఈ డాట్స్‌ మందులు, చికిత్సా సౌకర్యాలు మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఈ డాట్స్‌ పద్ధతిలో క్షయ రోగులు తప్పకుండా సరైన మోతాదులో డాట్‌ ప్రొవైడర్స్‌, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, అంగ న్వాడీ కార్యకర్తల పర్యవేక్షణలో పూర్తి కాలం మందులు వాడినట్లయితే క్షయ పూర్తిగా నయమవుతుంది. జీవితకాలం పెరుగుతుంది. క్షయ రోగులు మందులు వాడుతూ యధావిధిగా తమ పనులకు పోవచ్చును. క్షయ వ్యాధి దాంపత్య జీవితంపై ఎలాంటి ప్రభావం చూపదు.

క్షయ వ్యాధితో బాధపడుతున్న తల్లులు నోటికి అడ్డుగా దట్టమైన గుడ్డ పెట్టుకుని శిశువులకు పాలు పట్టవచ్చును. ముఖ్యంగా క్షయ రోగులు అన్ని రకాల ప్రొటీన్లు, విటమిన్లు ఉన్న మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మద్యం సేవించడం, పొగతాగటం, వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితి లోనూ డాక్టరు సలహాలేనిదే మధ్యలో మందులు మాని వేయరాదు. ఒకవేళ మధ్యలో మానివేస్తే క్షయ క్రిమి మందులకు లొంగకుండా మొండిగా తయారవుతుంది. దీనినే మల్టిపుల్‌ డ్రగ్‌ రెసిస్టెంట్‌ ట్యూబర్క్యులోసిన్‌ (ఎండిఆర్‌ టిబి) అని అంటారు. ఈ మొండి ఎండిఆర్‌ టిబిని నిరోధించడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ళ చికిత్స అవసరం ఉంటుంది. ఈ మొండి ఎండిఆర్‌ టిబినకు కూడా పూర్తికాలం మందులు వాడనట్లయితే వ్యాధి తీవ్రమై -ఎక్స్‌డిఆర్‌ -క్షయ గా మారి మరణానికి దారి తీస్తుంది. మన దేశంలో లక్ష మందికిపైగా ఎక్స్‌డిఆర్‌ క్షయ రోగులు ఉన్నారు. సాధారణ క్షయకు ఆరు నెలలు చికిత్స అవసరమైతే, ఈ మొండి క్షయకు చికిత్స దీర్ఘకాలం పడుతుంది. రానున్న కాలంలో కేవలం మూడు నెలల్లోనే క్షయ వ్యాధిని పూర్తిగా నియంత్రించే మందులు తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రయత్నాలు సఫలమైతే బాగా ముదిరిపోయిన మొండి క్షయ వ్యాధిని కూడా పూర్తిగా నియంత్రించే అవకాశం లభిస్తుంది. కాబట్టి క్షయవ్యాధి రాకుండా నివారించడానికి పుట్టిన పిల్లలకు వెంటనే బిసిజి (ఇద్దరు శాస్త్రజ్ఞులు పేరుతో రూపొందించిన బాసిలస్‌ కాల్‌మెట్‌ – గెరిన్) అనే టీకా వేయించాలి. చిన్నపిల్లలకు చికిత్స వారి బరువును బట్టి వైద్యాధికారి నిర్ణయిస్తారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి