రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆన్లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్ లో విశ్వాసనీయ సమాచారం మేరకు సీసీఎస్ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలోని టీం ఆన్ లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్న ఎండీ నహిద్ ను అరెస్టు చేశారు. అతని వద్ద నుండి రూపాయలు 4200 వేల నగదును, ఒక చరవాణి స్వాధీనం చేసుకన్నారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అప్పగించడం జరిగింది అని సీఐ తెలిపారు. ఈ టీం లో సీసీఎస్ ఎస్ఐ రమేష్ మరియు టీం మెంబర్స్ హనుమంత్ రావు, ఎంఏ కరీం, ధారట్ల శోభన్, మంగల్ సింగ్, ఠాకూర్ జగన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments