రిపబ్లిక్ హిందుస్థాన్,బజార్ హత్నూర్:గురువారం మండల పరిధిలోని టెంబి గ్రామపంచాయతీ లో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను బజార్ హత్నూర్ ఎంపీపీ అజాడే జయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం అవుతుందని,కేంద్ర ప్రభుత్వంచే విడుదలైన 15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి 3 లక్షల రూపాయలతో ఈ పనులు చేపడుతున్నామని, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వం నిధులచే అభివృద్ధి కార్యక్రమలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోమా రాంరెడ్డి , ఉపసర్పంచ్ పెందోర్ లక్ష్మణ్ , గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments