మంచిర్యాల జిల్లా భీమిని పోలీస్ స్టేషన్ పరిధి లోనీ చెన్నపూర్ లో రామగుండం టాస్క్ ఫోర్స్ మరియు భీమిని పోలీసుల సంయుక్త ఆకస్మిక తనిఖీ నిర్వహణ లో 50 వేల రూపాయల విలువ గల 25 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం రోజు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్ర శేఖర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు…టాస్క్ ఫోర్స్ సీఐ మహేందర్ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న , భీమినీ ఎస్సై వెంకటేష్, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలోని మెత్తం(చెన్నాపూర్) గ్రామంలోనీ ఠాక్రే సుధాకర్ అనే వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలు కలిగి ఉన్నాడనే పక్కా సమాచారంతో అతని ఇంటి పరిసరాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అతని వద్ద దాచి ఉంచిన 25 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు 50 వేల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
పట్టుబడిన నిందితుడి వివరాలు…
- ఠాక్రే సుధాకర్
S/o మల్లు మేర,
R/o. మెత్తం (చేన్నాపూర్), భీమిని. - టాస్క్ పోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న నిందితుడినీ మరియు స్వాధీనం చేసుకున్న నకిలీ విత్తనాలను, నిందితుడి వద్ద గల సెల్ ఫోన్ ను తదుపరి విచారణ నిమిత్తం భీమిని పోలీస్ వారికి అప్పగించారు.
ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న , భీమిని ఎస్ఐ వెంకటేష్ , మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్ , భాస్కర్ గౌడ్, శ్రీనివాస్, శ్యామ్ సుందర్ లు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments