ఇచ్చొడ గ్రామపంచాయతీ ఘనత …..
ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి పైనే మేకల వారసంత…..
వాహనాలు రోడ్డు పైనే పార్కింగ్………
ఇబ్బందులేదుర్కుంటున్న జనం …….
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చొడ : ఆదిలాబాద్ జిల్లా లో మేజర్ గ్రామపంచాయతీ , ఆదాయంలో టాప్… వసూళ్లలో టాప్… కానీ అభివృద్ధి లో మాత్రం శూన్యం…. ఇది పరిస్థితి.. పెరు గొప్ప ఊరు దిబ్బ.. ఇచ్చొడ గ్రామపంచాయతీ పరిస్థితి.
వ్యాపార కేంద్రమైన ఇచ్చోడ లో నిర్వహించే వారసంతల కొసం నిర్వహించే టెండర్లు లో లక్షల్లో డబ్బులు వసూలు చేసుకునే గ్రామపంచాయతీ అధికారులు , అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు.

ప్రతి సోమవారం జరిగే సంతలో వేల సంఖ్యలో జనం ఇచ్చొడ కు రావడం జరుగుతుంది. డిమాండ్ ఉన్న మార్కెట్ కావడంతో , వేలం నిర్వహించే సమయ వందల మంది పాల్గొని వేలం పాటలో అధిక మొత్తంలో చెల్లించి మార్కెట్ ను దక్కించుకుంటారు. వేలంలో పాల్గొనేవారు అధికారులకు కూడా కొంత మేరకు కమిషన్ ఇస్తారని ప్రచారం. ఇంత ధనిక మేజర్ గ్రామపంచాయతీ లో సమస్యలు మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.
Recent Comments