
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : సోషల్ మీడియా వల్ల ఈ మధ్య ప్రజా సమస్యలు కూడా పరిష్కరించబడుతున్నాయి. తాజాగా
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం నడిబొడ్డున ఉన్న పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన కోట్ల విలువైన ఖాళీ స్థలంలో మురికి నీరు చేరడంతో దుర్గంధ భరితంగా తయారై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుర్గంధం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది..ఈ స్థలాన్ని చూస్తే చూస్తే గ్రామపంచాయతీలోని ఆఫీసర్ల పనితనం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఆదిలాబాద్ మిర్రర్ అనే పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ గా మారింది. ఈ సమస్యను ట్విట్టర్ వేదికగా స్టేట్ లెవల్ లోని సంబంధించిన ఆఫీసర్లకు సమస్యను వివరించడంతో , స్పందించిన ఆఫీసర్లు పోస్ట్ ఆఫీస్ స్థలంలోని మురికిని శుభ్రం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జీపీ ఆఫీసర్లకు ఆదేశాలు జారీచేశారు.



Recent Comments