epaper
Thursday, January 22, 2026

కరోనా కష్టకాలంలో ” సహయోగ్ ” సేవలు ఆమోగం….

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

ఆరోగ్య సమస్యలున్న వారికి నిపుణులతో ఉచితంగా కన్సల్టెంట్స్ చేస్తున్న సంస్థ….

సహయోగ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న సీనియర్ డిడి న్యూస్ యాంకర్ అశోక్ శ్రీవాస్తవ్ ….

(సహయోగ్ సేవల పై రిపబ్లిక్ హిందూస్థాన్ డైలీ ఎడిటోరియల్ ప్రత్యేక కథనం )

కరోనా కష్టకాలంలో దీర్ఘకాలిక వ్యాధులు మరియు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి వెళ్లే అవకాశం లేకుండెను. ఒక పక్క కరోనా ఉధృతి ఉన్న వేళా ఆసుపత్రికి వెళితే కరోనా సోకె అవకాశం , ఈ సందర్భంలో వైద్యుల సహాయం కోసం ఎదురు చూస్తున్నా వారి కోసం దూరదర్శన్ న్యూస్ ఛానల్ న్యూస్ యాంకర్ సీనియర్ జర్నలిస్ట్ అశోక్ శ్రీవాస్తవ ఒక గొప్ప కార్యానికి నాంది పలికారు.

ఆన్లైన్ లో సహయోగ్ సేవలు వినియోగించుకుంటున్నా ప్రజలు

వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నా వారి ఉచితంగా ఇంటి వద్దే డిజిటల్ గా వైద్య సహాయం అందేలా సహయోగ్ టీం ను ఏర్పాటు చేశారు .

అప్పటి నుండి ఆన్లైన్ లో భారతీయ డాక్టర్లతో సహా అమెరికా మొదలు కొని అనేక ఇతర దేశాల డాక్టర్లతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.

కరోనా పై అవగాహన కల్పిస్తున్న సహయోగ్ టీం సభ్యులు

వారం లో ప్రత్యేకంగా ఏదొక వ్యాధి పై డాక్టర్లతో మరోరూ రోగులతో సమావేశం నిర్వహిస్తున్నారు.

వైద్యులు మరియు రోగుల మధ్య వారధిగా పనిచేస్తూ, సహకార బృందం ఆన్‌లైన్ ద్వారా ఉచిత సలహాలను అందిస్తోంది, ఇప్పటివరకు ఈ సహకార బృందం కార్యక్రమం ద్వారా దేశంలోని వేలాది మంది ప్రజలు ప్రయోజనం పొందారు. 
ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మరియు కొన్ని కారణాల వలన తెలంగాణ ప్రజలు తమ సమస్యల గురించి వైద్యుల సలహా తీసుకోలేకపోతున్నా వారూ సహయోగ్ యొక్క సహాయం ఉచితంగా తీసుకోవచ్చు.
దేశంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులను చూసి, సహయోగ్ టీమ్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ పేర్కొన్న విధంగా సీనియర్ జర్నలిస్ట్ అశోక్ శ్రీవాస్తవ్ లు సహయోగ్ టీమ్ ను విస్తరణ చేస్తున్నట్లు సమాచారం.

అవసరం ఉన్న వారికి ఇలా ఆపద సమయంలో ఉచితం గా సేవలు కల్పించడం నిజంగా హర్షించదగ్గ విషయం ...

మీరు కూడా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేనట్లయితే ఈ క్రింది నెంబర్ కు ఫొన్ చేసి ఆన్లైన్ లో ఉచితంగా సేవలు పొందవచ్చు.

ఉంచిత వైద్య సలహాల కోసం పై ఫోటో లో ఉన్న నెంబర్ కు వాట్సప్ చేయండి
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!