జ్వరం తో బాధపడుతున్న బాలుడ్ని మంచం పై చెరువు దాటించిన వైనం
రిపబ్లిక్ హిందూస్థాన్ , సిరికొండ : ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లో ఘటన చూస్తే స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు గడిచినా దేశ పరిస్థితి ఇలా ఉందా అని అనిపిస్తుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ మండలానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నాపూర్ తండా గ్రామంలో రాహుల్ అనే పది సంవత్సరాల బాలుడికి గత కొద్దిరోజులుగా తీవ్ర జ్వరం వస్తుంది .ఆదివారం రోజు జ్వరం తీవ్రం కావడంతో 108 కి ఫోన్ చేశారు. అయితే కన్నా పూర్ తండా నుండి 7 కిలోమీటర్ల దూరం లో వాహనము ఆగిపోయింది. కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు పక్కనున్న చెరువు నిండి రోడ్డు రెండు వైపులా నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు , కుటుంబీకులు అతి కష్టం మీద రోడ్డు దాటి ఆ బాలుణ్ణి 108 సిబ్బంది emt కాశినాథ్, పైలట్ గోపినాథ్ లు వాహనం దాకా తీసుకొచ్చారు. అటు వైపు వేరే మండలమైన ఇంద్రవెళ్లి కి వెళ్ళడానికి దారి ఉన్న చాలా దూరం వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుందని స్థానికులు తెలిపారు. చెరువులో రోడ్డు ఎత్తును పెంచి రవాణా సౌకర్యం మెరుగు పరచాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Recent Comments