రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా : తోబుట్టువుల కు పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. తనకు మాత్రం ఎన్నో సార్లు పెళ్లి చూపులు జరిగిన పెళ్లి మాత్రం జరగలేదు. పెళ్లి జరగడం లేదని జీవితం పై విరక్తి చెంది ఓ యువతి ఆత్మహత్య కు పాల్పడింది. పోలీసులు కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…. సిరిచేల్మా గ్రామానికి చెందిన జాఫర్ కు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు న్నారు. భార్య 9 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఇద్దరు కూతుళ్ళ లో పెద్ద కూతురికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. చిన్నా కూతురు హసీనా శహజాద్ బి (22) కి కూడా పెళ్లి చేయాలని జాఫర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే రెండు సంవత్సరాల కాలంలో అయిదారు పెళ్లి సంబంధాలు వచ్చిన పెళ్లి దాకా వెళ్ళలేదు. తాను సన్నగా , అందంగా లేను అని అందుకే పెళ్లి జరగడం లేదని ఊహించని నిర్ణయం తీసుకుంది. జీవితం పై విరక్తి చెందిన హసీనా శహజాద్ బి (22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.

కొద్దీ సేపటి తరువాత ఇంటికొచ్చి చూసిన ఆమె తండ్రి హుటాహుటిన ఇచ్చొడా ఆసుపత్రికి తరలించారు . అక్కడి నుండి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫరిద్ తెలిపారు.


Recent Comments