జెడ్డా, ఏప్రిల్ 4: జెడ్డాలో నిర్వహించిన బీబీఎన్ (BBN) నెట్వర్కింగ్ ఈవెంట్ ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, వ్యాపారవేత్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.


మల్లేశన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ SATA ఆధ్వర్యంలో, లక్నోకు చెందిన మిస్టర్ సాద్ యాజమాన్యంలో ఉన్న సెన్యార్ ట్రేడింగ్ కంపెనీలో ఈ సమావేశం నిర్వహించబడింది. కార్యక్రమానికి విశేష స్పందన లభించి, పాల్గొన్న వారందరికీ ఒక సానుకూల మరియు ఉత్సాహభరిత వాతావరణం ఏర్పడింది.
ఈ ఈవెంట్లో వివిధ రంగాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొని, నాణ్యమైన నెట్వర్కింగ్, వ్యాపార చర్చలు నిర్వహించారు. కొత్త పరిచయాలు ఏర్పడి, భవిష్యత్తులో సహకార అవకాశాలకు మార్గం సుగమమైంది. కార్యక్రమం నిర్వహణపై పాల్గొన్న వారు సంతృప్తిని వ్యక్తం చేశారు.

పాల్గొన్నవారు పరస్పర పరిచయాలను పెంపొందించుకోవడంతో పాటు, వ్యాపార మరియు కెరీర్ అవకాశాలను అన్వేషించుకున్నారు. అలాగే తమ అనుభవాలు, ఆలోచనలు ఒకరికొకరు పంచుకున్నారు.
ఈ విజయవంతమైన కార్యక్రమం జెడ్డాలో నెట్వర్కింగ్ వేదికల అవసరం పెరుగుతున్నదనికి నిదర్శనంగా నిలిచింది.
బీబీఎన్ నిర్వహణ బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.
ఇలాంటి మరిన్ని ప్రభావవంతమైన నెట్వర్కింగ్ ఈవెంట్లు త్వరలో నిర్వహించనున్నట్లు అనంతపురం చెందిన మిస్టర్ షౌకత్ తెలిపారు.


Recent Comments