• ముందస్తు అనుమతులు లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం
• ఆగస్టు 1 నుండి 31 తారీఖు వరకు నిబంధనలు వర్తిస్తాయి
• నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు
• ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణ దృశ్య, జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, జిల్లాలో ఉన్న ప్రశాంత వాతావరణ భంగం కాకుండా, సవ్యంగా కొనసాగించడానికి ఆగస్టు ఒకటి నుండి 31 వ తారీకు వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేస్తూ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 30 పోలీస్ ఆక్ట్ – 1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డిఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమి గుడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని మరియు సన్నాహాలు చేయరాదని తెలిపారు.
నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, దుడ్డు కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ఉసిగొలిపేటువంటి ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది దారి తీసే ప్రజా సమావేశాలు, జన సమూహం లాంటివి పూర్తిగా నిషేధించబడ్డాయని తెలిపారు. అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటివి వాటికి అనుమతులు లేవని తెలిపారు. ప్రచార రథాలు, మైకులు, తదితర అధిక శబ్దం పరికరాలు నిషేధించబడ్డాయని సూచించారు.
చట్ట ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం శిక్ష అర్హులవుతారని సూచించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులను పొందాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
Recent Comments