ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్, గాదిగూడ మండలాలలో 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు.
Thank you for reading this post, don't forget to subscribe!అనుమతులు లేకుండా సభలు ర్యాలీలు నిర్వహించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి.
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జైనూర్ సంఘటన దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఇంద్రవెల్లి నార్నూర్ గాదిగూడ మండలాల ప్రజలు ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. అనుమతులు లేకుండా గుమిగూడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. జైనూర్, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల నందు 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని తెలిపారు. ఉద్రిక్తతలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తగా చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఇతరులను జైనూర్ లోనికి అనుమతించడం జరగదని తెలిపారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులు నమ్మవద్దని సూచించారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో జైనూర్ ఉందని తెలిపారు. సోషల్ మీడియా నందు వదంతులను వ్యాప్తి చేసే వారిపై మరియు గ్రూప్ అడ్మిన్ లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
Recent Comments